అట్లీ..బ‌న్నీ మూవీ టైటిల్ ‘ఐకాన్’ ఫిక్స్..?

రూ. 800 కోట్ల భారీ బ‌డ్జెట్ తో మూవీ నిర్మాణం

భార‌త దేశ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో రూపొందుతున్న చిత్రం అట్లీ, అల్లు అర్జున్ తో. దీనిని త‌మిళ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చ‌ర్స్ తీస్తోంది. దీని అధినేత ద‌యానిధి మార‌న్ ఎంపీ. త‌న కూతురు కావ్య మార‌న్. త‌ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు సీఈఓగా ఉన్నారు. ఇప్పుడు ఈ సంస్థ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. దీనికి కార‌ణంగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అట్లీ కుమార్ , పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకున్న ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీ చేయ‌డం.

రోజు రోజుకు కొత్త అప్ డేట్స్ తో వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బుల్ రోల్ చేస్తాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. అంతే కాదు బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే ఇందులో కీ రోల్ పోషిస్తోంద‌ని, త‌న‌ను ద‌ర్శ‌కుడు లాక్ చేశాడ‌ని టాక్. ఇది ప‌క్క‌న పెడితే తాజాగా మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది ఏఏ22 మూవీ గురించి. ఏఏ అంటే అర్థం అల్లు అర్జున్, అట్లీ అని. 22 అనేది స‌న్ పిక్చ‌ర్స్ కు సంబంధించిన‌దా లేక బ‌న్నీ మూవీస్ సంఖ్యనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది ప‌క్క‌న పెడితే సినిమా టైటిల్ పై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు చేశార‌ని, చివ‌ర‌కు హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉండేలా ప్లాన్ చేస్తుండ‌డంతో త‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చూసేందుకు, అనువుగా పిలిచేందుకు గాను ఐకాన్ అని టైటిల్ ను ఫిక్స్ కూడా చేసిన‌ట్లు టాక్. కాగా ప్ర‌భాస్ స‌ర‌స‌న వంగా తీయ‌బోయే స్పిరిట్ మూవీలో న‌టించాల్సి ఉంది దీపికా ప‌దుకొనే. కానీ ఎందుక‌నో త‌ను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. చివ‌ర‌కు వంగా త్రిప్తి దిమ్రీని ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించాడు.

కాగా సినిమా కోసం అట్లీ ముగ్గురు హీరోయిన్ల‌ను ప‌రిశీలించాడ‌ని అందులో దీపికా, ర‌ష్మిక మంద‌న్నా, మృణాల్ ఠాకూర్ ఉంద‌ని టాక్. ఏది ఏమైనా అట్లీ, బ‌న్నీ మూవీ ఇంకా ప్రారంభం కానేలేదు అంత‌ర్జాతీయ మార్కెట్ ను షేక్ చేస్తోంది. ఇది పూర్తిగా రూ. 2000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌నుంద‌ని టాక్.

Comments (0)
Add Comment