భారతీయ సినిమా రంగంలో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తను తీసిన బాహుబలి ఎపిక్ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఇందులో నటించిన ప్రభాస్, అనుష్క శెట్టిలకు మంచి పేరు వచ్చింది. డార్లింగ్ పాన్ ఇండియా హీరోగా మారి పోయాడు. ఈ ఒక్క మూవీ ఎందరినో లైమ్ లైట్ లోకి తీసుకు వచ్చేలా చేసింది.
ఆశించిన దానికంటే ఎవరూ ఊహించని రీతిలో కోట్లాది రూపాయలు కురిపించింది ఈ చిత్రం. బాహుబలికి సీక్వెల్ కూడా తీశాడు రాజమౌళి. ఇది కూడా బిగ్ హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాలతో పాటు తాను తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డు బ్రేక్ చేసింది. వసూళ్లలో అత్యధికంగా కలెక్షన్స్ చేసి చరిత్ర సృష్టించింది.
ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 పేరుతో మూవీ తీస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇందులో ప్రిన్స్ మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. షూటింగ్ 20 శాతం దాకా పూర్తయింది. అయితే ఇది పూర్తయ్యేందుకు కనీసం 2 ఏళ్లు పడుతుందని అంచనా. తను తీసే ప్రతి సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటాడు ఎస్ఎస్ రాజమౌళి.
భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన బాహుబలికి దర్శకుడి తండ్రి , ఎంపీ విజయేంద్ర ప్రసాద్ కథను కూర్చాడు. ఇక సోదరుడు ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ దక్కింది. ఇప్పుడు టాలీవుడ్ లో గతంలో సక్సెస్ అయిన సినిమాలను తిరిగి విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి బాహుబలిని ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ వెల్లడించారు. గతంలో ఉన్న చిత్రానికి అదనపు సీన్స్ జత చేస్తారు.