Charan-Game Changer : అబ్బాయి సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా రానున్న బాబాయ్

ఆంధ్రాలో ఆ రేంజ్‌లో జరిగే ఈవెంట్‌కి ఛీఫ్‌ గెస్ట్ ఎవరు?..

Game Changer : సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్లలో జోరు చూపిస్తున్నారు గేమ్‌ చేంజర్‌(Game Changer) టీమ్‌. ఆల్రెడీ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌ని అనౌన్స్ చేశారు. ఇటు పాటల రిలీజుల్లోనూ ఫాస్ట్ గా ఉన్నారు. అంతా బావుంది.. మరి తెలుగు స్టేట్స్ లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఎక్కడ చేస్తారూ.. అంటారా.? జనవరిలో రిలీజ్‌ అయ్యే గేమ్‌ చేంజర్‌కి ఇప్పటి నుంచే బజ్‌ సూపర్‌గా ఉంది. దానికి తగ్టట్టే ఈవెంట్స్ గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో చేయడానికి ఫిక్స్ అయ్యారు. రాజమండ్రి వేదికగా ప్లాన్‌ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ మిస్‌ అయితే కాకినాడగానీ, ఏలూరుగానీ వెన్యూ అవుతుంది.

Game Changer Movie Updates

ఆంధ్రాలో ఆ రేంజ్‌లో జరిగే ఈవెంట్‌కి ఛీఫ్‌ గెస్ట్ ఎవరు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గేమ్‌చేంజర్‌ ఈవెంట్‌కి ఛీఫ్‌ గెస్ట్ అనే మాట మెగా ఫ్యాన్స్ లో డబుల్‌ జోష్‌ నింపుతోంది. అబ్బాయ్‌ కోసం బాబాయ్‌ తరలి వస్తున్నారనే టాపిక్‌ యమాగా కిక్‌ ఇస్తోంది. గేమ్‌ చేంజర్‌ లేటెస్ట్ మెలోడీకి కూడా మంచి మార్కులు పడుతున్నాయి. కార్తిక్‌, శ్రేయా ఘోషల్‌ పాడిన ఈ పాట ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది. శంకర్‌ కోసం తమన్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుని చేశారనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇంత మంది కలిసి చేసిన మేజిక్‌కి జనవరి 10న ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారోనని ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తి మొదలైంది.

Also Read : Ajaz Khan : ప్రముఖ బాలీవుడ్ నటుడు ‘అజాజ్ ఖాన్’ భార్య అరెస్ట్

Cinemagame changerTrendingUpdatesViral
Comments (0)
Add Comment