Babloo Prithiveeraj: పెళ్లైన ఏడాదికే విడాకులకు సిద్ధమైన టాలీవుడ్ నటుడు ?

పెళ్లైన ఏడాదికే విడాకులకు సిద్ధమైన టాలీవుడ్ నటుడు ?

Babloo Prithiveeraj: 1979 లో ‘నాన్ వళవయ్యప్పన్’ అనే తమిళ సినిమాలో బబ్లూ అనే పేరుతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం తెలుగు, తమిళం భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన నటుడు బబ్లూ పృథ్వీరాజ్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గానూ అనేక సినిమాల్లో నటించారు. పెళ్ళి, ప్రేయసిరావే, దేవుళ్ళు, సమరసింహారెడ్డి, నువ్వునాకు నచ్చావ్ వంటి సినిమాలతో పాటు 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లోనూ నటించాడు. ఆ మధ్య అవకాశాల్లేక వెనుకబడిన నటుడు మళ్లీ ఇప్పుడు స్పీడు పెంచి ఇటీవల రిలీజైన స్కంద, యానిమల్ సినిమాలతో పాటు దయ అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు.

Babloo Prithiveeraj – మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన పృథ్వీ

అయితే వృత్తిపరమైన విషయాల కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు పృథ్వీరాజ్‌(Babloo Prithiveeraj). 1994లో బీనా అనే మహిళను పెళ్లాడిన పృథ్వీరాజ్… అహద్‌ మోహన్‌ జబ్బర్‌ అనే కొడుకు కూడా కన్నాడు. ఆటిజం సమస్యతో బాధపడే కొడుకు అహాద్ ను శారీరకంగా హింసించాడంటూ బెంగుళూరు ఎయిర్ పోర్టు సిబ్బంది ఇతనిపై ఫిర్యాదు కూడా చేసారు. దీనితో వీరి మధ్య పొరపొచ్చాలు రావడంతో వీరు గతేడాది విడాకులు తీసుకున్నారు.

తన కంటే 30 ఏళ్ళు చిన్న అయిన తెలుగు అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న పృథ్వీ

అదే సమయంలో శీతల్ అనే 23 ఏళ్ళ తెలుగు యువతికి దగ్గరయిన పృథ్వీరాజ్… 57 ఏళ్ళ వయసులో గతేడాది నవంబరులో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పృథ్వీరాజ్ తనకంటే దాదాపు ముఫ్పై ఏళ్ళు పెద్ద అయినప్పటీకీ శీతల్ పెళ్ళి చేసుకోవడంతో అప్పట్లో వీరి పెళ్లి సంచలనంగా మారింది. అయితే వీరు పెళ్లి చేసుకుని ఏడాది తిరగకముందే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తి… విడాకులకు దారి తీస్తున్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీనికి బబ్లూ తనకు ప్రపోజ్‌ చేసిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ నుండి శీతల్‌ డిలీట్‌ చేయడం… ఈ రూమర్స్‌ మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. అయితే ఇందులో ఈ రూమర్స్ ఎంతవరకు నిజమనేది వారి మాటల్లోనే తెలియాల్సి ఉంది.

Also Read : Rishab Shetty: అభిమానితో రష్మికకు క్లారిటీ ఇప్పించిన రిషబ్ శెట్టి

Babloo Prithiveeraj
Comments (0)
Add Comment