లండ‌న్ లో బాల‌య్య స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌లు

ఘ‌ణంగా తెలుగుదేశం మినీ మ‌హానాడు

యుకె – తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, మహానేత, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు లండ‌న్ లో టీడీపీ ఆధ్వ‌ర్యంలో . జీవం ఉట్టిపడేలా అలంకరించిన తారక రాముని చిత్రాలతో, ఆ మహానీయుని జీవిత విశేషాలతో కూడిన చిత్రపటాలతో, చిన్నారులు, మహిళలు, అభిమానుల కేరింతల నడుమ, పసుపు మయంగా అలంకరించబడిన వేదిక మీద, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

మేరు నగధీరుడైన తారక రాముని విగ్రహ ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలతో వేడుకలు ఆరంభమయ్యాయి. పహల్గాం తీవ్రవాదుల దాడిలో అమరులైన వీరులకి సంతాప తీర్మానంతో పాటు పాకిస్థాన్ తీవ్రవాదుల మీద వీరోచిత పోరాటం జరిపిన భారత సైనికులకు, దేశ ప్రధాని నరేంద్రమోడీ చూపిన సమర్ధ నాయకత్వానికి అభినందన తీర్మానం చేశారు.

ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన తెచ్చిన సంక్షేమ విధానాలను నేటి తరానికి పరిచయం చేశారు., ఆయన చూపించిన దారిలో తెలుగు వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పార్టీని ముందుకు నడిపించే సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

ఎన్టీఆర్ ఇచ్చిన ఆత్మగౌరవంకి చంద్రన్న నింపిన ఆత్మవిశ్వాసంతో తెలుగుజాతి ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లో దూసుకు పోతుందని, ఆధునిక AI , QUANTUM యుగంలో తెలుగువాళ్లు మరిన్ని అవకాశాలని అందిపుచ్చుకుని విశ్వవిజేతలుగా నిలవాలనే బాబు సంకల్పానికి అనుగుణంగా ప్రతి NRI ఎదిగేలా కష్టపడదామని ప్రతినిధులు పిలుపునిచ్చారు.

హిందూపురం హ్యట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారం వరించిన ఆనంద తరుణంలో, 50 వసంతాల సినీ ప్రయాణ స్వర్ణోత్సవ సంవత్సర సందర్భంగ త‌న‌ను ఘ‌నంగా స‌న్మానించారు.

Comments (0)
Add Comment