Bandra Tamannah : బాంద్రా జోష్ త‌మ‌న్నా ఖుష్

మ‌ల‌యాళం మూవీ స‌క్సెస్ టాక్

Bandra Tamannah : ప్ర‌ముఖ న‌టి త‌మ‌న్నా భాటియా స్పీడ్ మీదుంది. వ‌రుస మూవీస్ తో దూసుకు పోతోంది. త‌మిళ సినీ ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో క‌లిసి న‌టించిన జైల‌ర్ రికార్డుల మోత మోగించింది. ఏకంగా ఈ మూవీ రూ. 600 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇదే స‌మ‌యంలో త‌ను వెబ్ సీరీస్ ల‌స్ట్ సీరీస్ లో న‌టించింది. ఇందులో అందాల‌ను ఆర‌బోసింది. మ‌రో వైపు జైల‌ర్ లో త‌ను కావాల‌య్య పేరుతో చేసిన సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Bandra Tamannah Movie Updates

ఇటు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంక‌ర్ లో న‌టించింది. ఇదే స‌మ‌యంలో తాజాగా మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా. దీపావ‌ళి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని త‌ను దిలీప్ తో క‌లిసి న‌టించిన బాంద్రా(Bandra) మూవీ విడుద‌లైంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

మొత్తంగా దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ప‌డింది త‌మ‌న్నా భాటియా. త‌ను తెలుగులో వెంక‌టేశ్ తో న‌టించిన ఎఫ్ -2, ఎఫ్ 3 సూప‌ర్ స‌క్సెస్. మొత్తంగా త‌మ‌న్నా మ‌రోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మార‌డం విశేషం. రాబోవు రోజుల్లో మ‌రికొన్ని మ‌ల‌యాళం సినిమాల‌లో ఛాన్స్ లు ద‌క్కించు కోవ‌డం ఖాయంగా తోస్తోంది.

Also Read : Trisha Krishnan : లియో స‌క్సెస్ త్రిష‌కు డిమాండ్

Comments (0)
Add Comment