IPL 2025 : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన టోర్నీగా గుర్తింపు పొందింది ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్)కు. ఈసారి కూడా ఆర్భాటంగా ప్రారంభమైంది. చివరి దశలో టోర్నీ ఉన్న సమయంలో ఉన్నట్టుండి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆటగాళ్ల భద్రతా కారణాల కారణంగా బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించింది. ఈ మేరకు పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
IPL 2025 Interesting Updates
ఆటగాళ్ల భద్రత తమకు ముఖ్యమని, పాకిస్తాన్ దాడులు చేసేందుకు ఆస్కారం ఉందని కేంద్రం హెచ్చరించడంతో తాము కొంత కాలం పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు బీసీసీఐ కార్యదర్శి జే షా. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ నిర్వహించాల్సి ఉంది. కొన్ని మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణ పాటించాలని ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ సమయంలో తిరిగి ఐపీఎల్(IPL 2025) ను నిర్వహించే ఛాన్స్ లేక పోలేదని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే టోర్నీ పరంగా ఇది 18వ సీజన్. ఇందులో 10 జట్లు పాల్గొంటున్నాయి. ప్రపంచంలో టాప్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో ఈ టోర్నీకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
Also Read : Pakistan Attack : పాకిస్తాన్ నమ్మక ద్రోహం దాడులు ముమ్మరం