Hero Ram Pothineni-Borse :రామ్ పోతినేనితో బోర్సే డేటింగ్ నిజ‌మేనా..?

అలాంటిది ఏమీ లేదంటున్న ముద్దుగుమ్మ

Ram Pothineni : న‌టించింది ఒకే ఒక్క మూవీ కానీ పెద్ద ఎత్తున ఆఫ‌ర్స్ కూడా కొట్టేసింది బాలీవుడ్ బ్యూటీ భాగ్య‌శ్రీ బోర్సే. త‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీలో కీ రోల్ పోషించింది. అందం, అభిన‌యంతో ఆక‌ట్టు కోవ‌డంతో త‌ను రెండు సినిమాల‌కు సంత‌కం చేసింది. ప్ర‌స్తుతం యంగ్ హీరో రామ్ పోతినేనితో(Ram Pothineni) జ‌త‌క‌ట్టింది. త్వ‌ర‌లోనే రౌడీ బాయ్ గా పేరొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కూడా న‌టించేందుకు సిద్ద‌మైంది. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Ram Pothineni-Bhagyashri Borse

ఆ మూవీ టైటిల్ కూడా క‌న్ ఫ‌ర్మ్ చేశారు మూవీ మేక‌ర్స్. దానికి క్యాచీగా ఉండేలా రౌడీ జ‌నార్ద‌న్ అని పేరు పెట్టారు. ఇందులో రౌడీతో భాగ్య‌శ్రీ బోర్సే న‌టించ‌నుంద‌ని ప్ర‌క‌టించారు. తాజాగా రామ్ తో న‌టిస్తున్న సినిమా షూటింగ్ లో ఇద్ద‌రి మ‌ధ్య చనువు ఏర్ప‌డింద‌ని, అది చివ‌ర‌కు డేటింగ్ చేసేంత దాకా వెళ్లింద‌ని టాలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కీల‌క స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించిన‌ట్టు టాక్. దీనిని పూర్తిగా రొమాంటిక్ కామెడీ గా తీర్చి దిద్దే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు ద‌ర్శ‌కుడు. దీనికి ర్యాప్022 అని పేరు పెట్టారు.

ఆన్ స్క్రీన్ లోనే కాదు బ‌య‌ట కూడా మ‌రింత చ‌నువుగా ఉంటున్నార‌ని , ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని స్థితికి వ‌చ్చిన‌ట్లు రూమ‌ర్స్ వ్యాపించాయి. ఈ సినిమాకు పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ దీనిని నిర్మిస్తోంది. దీంతో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. సాగ‌ర్ గా రామ్,, మ‌హాల‌క్ష్మి పాత్ర‌లో బోర్సే కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇద్ద‌రికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. డేటింగ్ పై స్పందించిన బోర్సే అలాంటిది ఏమీ లేద‌ని పేర్కొంది.

Also Read : Hero Mahesh Babu-ED :ప్రిన్స్ మహేష్ బాబుకు ఈడీ స‌మ‌న్లు జారీ

Bhagyashri BorseDating RumoursRam PothineniUpdatesViral
Comments (0)
Add Comment