Hero Dulquer-Bhagyashri :పీరియాడిక్ మూవీగా సెల్వ‌రాజ్ ‘కాంత’

దుల్మ‌ర్ స‌ల్మాన్..ల‌వ్లీ బ్యూటీ బోర్సే

Bhagyashri : ఏ ముహూర్తాన ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ త‌న‌ను తీసుకు వ‌చ్చాడో పంట పండేలా చేసింది న‌టి భాగ్య‌శ్రీ బోర్సేకు. త‌ను టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది . స్టార్ హీరో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ లో కీ రోల్ పోషించింది. అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఆశించిన మేర ఆడ‌లేదు. అయినా భాగ్య‌శ్రీ‌కి మంచి మార్కులు వ‌చ్చాయి. ఊహించ‌ని రీతిలో సినిమాల‌లో ఛాన్స్ లు వ‌చ్చాయి. త‌ను గౌత‌మ్ తిన్న‌సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న కింగ్ డ‌మ్ లో కీల‌క పాత్ర పోషిస్తోంది.

Bhagyashri Borse-Dulquer Salmaan Movie Updates

ఇదే స‌మ‌యంలో యంగ్ హీరో రామ్ పోతినేనితో క‌లిసి మ‌రో ప్రాజెక్టులో పాలు పంచుకుంటోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సార‌థ్యంలో రౌడీ హీరోతో క‌లిసి రౌడీ జ‌నార్ద‌న్ చిత్రంలో న‌టించ‌నుంది బోర్సే. ఇదే స‌మ‌యంలో మ‌రికొన్ని సినిమాల‌లో న‌టించేందుకు గాను సంత‌కాలు కూడా చేసిన‌ట్లు వినికిడి. మొత్తంగా త‌ను వ‌చ్చీ రావ‌డంతోనే ఫుల్ జోష్ లో ఉంది భాగ్య‌శ్రీ బోర్సే. త‌న‌కు సంబంధించి మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది.

మ‌ల‌యాళ సినీ రంగానికి చెందిన ఉత్త‌మ న‌టుడు పుర‌స్కార గ్ర‌హీత దుల్క‌ర్ స‌ల్మాన్(Dulquer Salmaan) తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది భాగ్య‌శ్రీ బోర్సే. ఈ ఇద్ద‌రూ క‌లిసి పీరియాడిక్ నేప‌థ్యంతో సాగే కాంత మూవీలో న‌టించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీనికి త‌మిళ సినీ రంగానికి చెందిన సెల్వ‌మ‌ణి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండడం విశేషం. ఇది 1950 మ‌ద్రాస్ నేప‌థ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా భాగ్య‌శ్రీ బోర్సే పుట్టిన రోజు మంగ‌ళ‌వారం కావ‌డంతో ఈ సంద‌ర్బాన్ని పుర‌స్క‌రించుకుని మూవీ మేక‌ర్స్ తాజా పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు.

Also Read : Popular Actor Rajendra Prasad :30న న‌ట కిరీటి ష‌ష్టి పూర్తి రిలీజ్

Bhagyashri BorseCinemaDulquer SalmaanTrendingUpdates
Comments (0)
Add Comment