Bhairavam Movie Sensational :భైరవం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Bhairavam : యంగ్ డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం భైర‌వం. ఇందులో మంచు మ‌నోజ్ , బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నామ‌ని, అయితే వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈనెల 30న రిలీజ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మూవీ మేక‌ర్స్. సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయ‌ని, త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టు కోవ‌డం ఖాయ‌మ‌న్నారు.

Bhairavam Movie Sensational Updates

భైర‌వం చిత్రాన్ని పూర్తిగా యాక్ష‌న్, ఎంటర్ టైన‌ర్ గా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. అంతే కాకుండా ఈ మూవీలో నారా రోహిత్ మ‌రో కీల‌క రోల్ పోషించాడు. భారీ బ‌డ్జెట్ తో దీనిని నిర్మించామ‌ని, త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు సినీ నిర్మాత‌లు. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కెకె రాధా మోహ‌న్ నిర్మించారు. భైర‌వం(Bhairavam) టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. ఈ సంద‌ర్బంగా న‌టుడు మంచు మ‌నోజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు .

సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టాడు. ఈ వేసవిలో మరెక్కడా లేని సినిమా అనుభవానికి సిద్ధంగా ఉండాల‌ని కోరాడు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద స్క్రీన్ ల‌లో చూసేందుకు రెడీ కావాల‌ని పిలుపునిచ్చాడు. యాక్ష‌న్ , భావోద్వేగం , విడ దీయ‌రాని సోద‌ర స్పూర్తితో నిండిన పురాణ ప్ర‌యాణానికి సిద్దం కావాల‌ని విన్న‌వించాడు. కాగా భైర‌వం చిత్రంలో జ‌య‌సుధ‌, అదితి శంక‌ర్, ఆనంది, దివ్య పిళ్లై, శ‌ర‌త్ లోహితాశ్వ‌, సంప‌త్ రాజ్ , సందీప్ రాజ్ , వెన్నెల కిషోర్ న‌టించారు.

Also Read : Rashmika Mandanna Interesting :ర‌ష్మిక మంద‌న్నా ఆస‌క్త‌క‌ర వ్యాఖ్య‌లు

Bellamkonda Sai SreenivasBhairavamCinemaManchu ManojNara RohitUpdatesViral
Comments (0)
Add Comment