Bhola Shankar OTT Release : నెట్ ఫ్లిక్స్ లో భోళా శంక‌ర్

చిరంజీవి కెరీర్ లో బిగ్ డిజాస్ట‌ర్

Bhola Shankar OTT Release : మెగా ఫ్యాన్స్ కు ఖుష్ ఖ‌బర్ చెప్పారు మూవీ మేక‌ర్స్. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భోళా శంక‌ర్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రానుంది. ఈ మేర‌కు ముహూర్తం కూడా ఖ‌రారు చేశారు. సెప్టెంబ‌ర్ 15న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించింది.

Bhola Shankar OTT Release Soon

చిరంజీవి కెరీర్ లో బిగ్ డిజాస్ట‌ర్ గా మిగిలి పోయింది. క‌థ ఆది నారాయ‌ణ అందిస్తే, మాట‌లు సినిమాకు శివ రాశారు. త‌మిళంలో బిగ్ హిట్ అయిన వేద‌ల‌మ్ ఆధారంగా భోళా శంక‌ర్(Bhola Shankar) ను తీశాడు మెహ‌ర్ ర‌మేష్. ఈ చిత్రాన్ని రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు.

ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు త‌మ‌న్నా భాటియా, కీర్తి సురేష్ , సుశాంత్ న‌టించారు. డూడ్లీ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తే, సంగీతం మ‌హతి స్వ‌ర సాగ‌ర్ అందించారు. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ , క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ , జీ స్టూడియోస్ పంపిణీ చేశాయి.

ఆగ‌స్టు 11న భోళా శంక‌ర్ ను విడుద‌ల చేశారు. ఆశించిన మేర ఆడ‌లేదు ఈ చిత్రం. ఇదే స‌మ‌యంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , త‌మ‌న్నా భాటియాతో క‌లిసి న‌టించిన జైల‌ర్ దుమ్ము రేపింది. ఏకంగా రూ. 600 కోట్లు కొల్ల‌గొట్టింది. జైల‌ర్ దెబ్బ‌కు భోళా శంక‌ర్ బోల్తా ప‌డింది. ఈ త‌రుణంలో నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.

Also Read : Ram Gopal Varma : ‘స్కిల్’ క్రిమిన‌ల్ – ఆర్జీవీ

Comments (0)
Add Comment