Pavani Reddy : సినీ రంగంతో పాటు బుల్లితెర, ఓటీటీలలో నటిస్తున్న వారికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఇదే ప్రోగ్రామ్ లో మంచి పేరు తెచ్చుకున్న అమీర్ , పావని రెడ్డి(Pavani Reddy)లు చెన్నై వేదికగా ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఓ రిసార్ట్ లో జరిగింది. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు వీరి వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.
Big Biss Amir-Pavani Reddy Marriage Updates
కుటుంబీకులు, స్నేహితులు, ఇతరులు జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దేశ మంతటా కుల, మతాల పేరుతో కొట్టుకు చస్తున్నారు. కానీ సినిమా రంగానికి సంబంధించి ఇలాంటివి ఏమీ పట్టించుకోవడం లేదు నటీనటులు. బాలీవుడ్ కు చెందిన సోనాక్షి సిన్హా ముస్లిం ను పెళ్లి చేసుకుంది. తన తండ్రి నటుడు, టీఎంసీ ఎంపీగా ఉన్నారు. ఆయనే శత్రుఘ్న సిన్హా. ఎలాంటి అభ్యంతరం తెలుప లేదు.
ఇక తాజాగా చూస్తే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన అమీర్ ముస్లిం. అయినప్పటికీ పావని రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినది. ఆమె కోరికతో పాటు పేరెంట్స్ అభిప్రాయాల మేరకు అమీర్ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు అమీర్ ఒప్పుకోవడం విశేషం. ఇదిలా ఉండగా పావని రెడ్డికి ఇది రెండో పెళ్లి. తను ఇంత ముందు ప్రదీప్ అనే వ్యక్తిని 2017లో పెళ్లి చేసుకుంది. కొన్ని నెలలు అయ్యాక సూసైడ్ చేసుకున్నాడు.
ఇక పావని రెడ్డి 2012 నుంచి టాలీవుడ్ లో నటిస్తూ వస్తోంది. తను అమృతంలో చందమామ, గౌరవం, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారి 111 లో నటించింది. తెలుగు, తమిళ సీరియల్స్ లలో నటించింది..మెప్పించింది..ప్రేక్షకుల మనసు దోచుకుంది. మొత్తంగా ఈ ఇద్దరు ఒక్కటి కావడం ఆసక్తిని రేపింది.
Also Read : Krishna Bhagavan- Hero Pawan :దమ్మున్నోడు అనుకున్నది సాధించాడు