బాయ్ కాట్ సితారే జ‌మీన్ ప‌ర్ ట్రెండింగ్

ఆమీర్ ఖాన్ పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేక‌త

బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నాడు. తన‌తో పాటు జెనీలియా దేశ్ ముఖ్ క‌లిసి న‌టించిన చిత్రం సితారే జ‌మీన్ ప‌ర్. ఈ మూవీ గ‌తంలో విడుద‌లైంది. మంచి స‌క్సెస్ సాధించింది. అయితే ఈ మ‌ధ్య‌న సినీ రంగంలో కొత్త ట్రెండ్ మొద‌లైంది. గ‌తంలో రిలీజ్ అయి భారీ విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న సినిమాల‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జెనీలియా దేశ్ ముఖ్ పాత్ర‌కు కొంచెం మెరుగులు దిద్దుతూ తాజాగా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్.

ఇదిలా ఉండ‌గా ఏప్రిల్ 22న జ‌మ్మూ కాశ్మీర్ లోని పహ‌ల్గామ్ ఘ‌ట‌న‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు 26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత భార‌త్ సీరియ‌స్ గా తీసుకుంది. పాకిస్తాన్ పై ఏకంగా ఆప‌రేష‌న్ సిందూర్ మిష‌న్ మొద‌లు పెట్టింది. దీంతో ఇండియా కొట్టిన దెబ్బ‌కు దాయాది దేశం విల విల లాడింది. చివ‌ర‌కు కాళ్ల బేరానికి వ‌చ్చింది. శాంతి కోసం చ‌ర్చ‌లు జ‌రుపుతామంటూ ప్ర‌పోజ‌ల్ చేసింది. ఈ సంద‌ర్భంగా సినీ రంగానికి చెందిన చాలా మంది ప్ర‌ముఖులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, సాంకేతిక నిపుణులు సైతం భార‌త్ చేప‌ట్టిన మిష‌న్ కు స‌పోర్ట్ గా నిలిచారు.

అయితే ఆమీర్ ఖాన్ మాత్రం ఎలాంటి స్పంద‌న వ్య‌క్తం చేయ‌లేదు. తాజాగా సినిమా రిలీజ్ సంద‌ర్బంగా ప్ర‌త్యేకంగా ఆప‌రేష‌న్ సిందూర్ గురించి ప్ర‌స్తావించ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో తాను న‌టించిన సితారే జ‌మీన్ ప‌ర్ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఇది సోష‌ల్ మీడియాలో టాప్ లో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.

Comments (0)
Add Comment