హాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ నటుడిగా గుర్తింపు పొందారు బ్రాడ్ పిట్. ఏ పాత్ర లోనైనా వంద శాతం లీనమై పోయి ఆకట్టుకుంటాడు. తను తాజాగా నటించిన చిత్రం ఎఫ్1. దీనిని జూన్ 27న రిలీజ్ కానుంది. ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రధానంగా హై స్టేక్స్ ఫార్ములా -1 రేసింగ్ పై ప్రధానంగా దృష్టి సారించారు దర్శకుడు. అద్భుతమైన వేగం, దానికి తోడు ఉత్కంఠ, ఆకట్టుకునే డ్రామా నేపథ్యంతో తెరకెక్కించాడు.
ఈ సినిమాకు ప్రత్యేకత ఏమిటంటే కథను కూడా రాశాడు చిత్ర నిర్మాత జోసెఫ్ కోసిన్స్కీ. ఇక సినిమాలోని సన్నివేశాలు మరింత ఉత్కంఠను రేపేలా ఉన్నాయని పేర్కొంటున్నారు సినీ విమర్శకులు. ఇందులో ముఖ్య పాత్రను పోషించాడు హాలీవుడ్ ఐకాన్ గా పేరొందిన ఆస్కార్ అవార్డు గ్రహీత బ్రాడ్ పిట్. పోటీ రేసింగ్ ప్రధానంగా సాగే ఈ మూవీలో తను డ్రైవర్ గా మనకు దర్శనం ఇస్తాడు.
ఈ చిత్రానికి ఆపిల్ ఒరిజినల్ ఫిల్మ్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్ , డాన్ అపోలో ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ మద్దతు ఇస్తున్నాయి. ఈ సందర్బంగా దర్శకడుఉ జోసెఫ్ కోసిన్స్కీ మీడియాతో మాట్లాడారు. ఎఫ్1 అనేది పూర్తిగా రేసింగ్ ను ఆధారంగా తీశామన్నాడు. యాక్షన్ ప్యాక్డ్ వినోదాత్మకంగా తెరకెక్కించామని చెప్పాడు. బ్రాడ్ పిట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని పేర్కొన్నాడు దర్శకుడు.
వంద శాతానికి పైగా ఎఫర్ట్స్ పెట్టాడని నటుడి గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. తను లేక పోతే ఈ ఎఫ్1 సినిమా లేదన్నాడు. తనే కీలకమని పేర్కొన్నాడు.