Legendary Actor Brahmanandam : బ్ర‌హ్మానందం సినీ వేదాంతం

30 ఏళ్ల ఇండస్ట్రీ అయినా ఏం లాభం

Brahmanandam : తెలుగు తెర‌పై న‌వ్వుల రేడు ఒకే ఒక్క‌డు బ్ర‌హ్మానందం. ఆయ‌న అస‌లు పేరు క‌న్నెగంటి బ్ర‌హ్మానంద చారి. అష్ట క‌ష్టాలు ప‌డ్డాడు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెరిగాడు. లెక్చ‌ర‌ర్ గా త‌న జీవితాన్ని ప్రారంభించిన బ్ర‌హ్మానందం ఉన్న‌ట్టుండి దివంగ‌త జంధ్యాల కంట్లో ప‌డ్డాడు. ఇంకేం త‌న సినీ కెరీర్ అద్బుతంగా ప్రారంభ‌మైంది. అది నాటి నుంచి నేటి దాకా అప్ర‌హ‌తిహ‌తంగా కొన‌సాగుతూనే వ‌స్తోంది.

Brahmanandam Comment

ఈ మ‌ధ్య‌నే భిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకునేందుకు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు బ్ర‌హ్మానందం(Brahmanandam). వ‌య‌సు పెరిగే కొద్దీ ఆలోచ‌న‌ల్లో మార్పులు వ‌స్తాయ‌ని, 30 ఏళ్లుగా సినీ ఇండ‌స్ట్రీలో ఉన్నా ఏదో తెలియ‌ని వెలితి అనేది క‌లుగుతోందంటూ పేర్కొన్నారు. త‌న త‌న‌యుడితో క‌లిసి బ్ర‌హ్మ ఆనందం సినిమాలో న‌టిస్తున్నాడు.

ఇందులో తాత‌, మ‌న‌వడి పాత్ర‌ల్లో తండ్రీకొడుకు న‌టిస్తుండ‌డం విశేషం. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌కుటం లేని మ‌హ‌రాజుగా, కామెడీ కింగ్ గా సుప్ర‌సిద్దులైన బ్ర‌హ్మానందం ఉన్న‌ట్టుండి వేదాంతం మాట్లాడ‌టం ఏమిటంటూ అభిమానులు ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నారు. స్వ‌త‌హాగా పండితుడు, మేధావి, ర‌చ‌యిత‌, వ‌క్త‌, అంత‌కు మించిన శిల్పి, చిత్ర‌కారుడు..ఇలా భిన్న‌మైన ప్ర‌తిభా నైపుణ్యం ఆయ‌న స్వంతం.

సినిమా టీజ‌ర్ రిలీజ్ సంద‌ర్బంగా బ్ర‌హ్మానందం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సినిమాలే కాదు వ‌య‌సు కూడా ముఖ్య‌మేనంటూ కామెంట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : Saif Ali Khan Attack : ప‌లు సినిమాల‌పై సైఫ్ అలీ ఖాన్ ఎఫెక్ట్

BrahmanandamCommentsViral
Comments (0)
Add Comment