టాలీవుడ్ లోకి మరో నందమూరి వారసుడు
Breathe : విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు(NTR) కుటుంబం నుండి మరో వారసుడు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ వారసుడు నందమూరి చైతన్య కృష్ణ…. ‘బ్రీత్’ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం కాబోతున్నారు. కుమారుడి కోసం నందమూరి జయకృష్ణ నిర్మాతగా మారి బసవతారక రామ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘రక్ష’, ‘జక్కన్న’ సినిమాలు తీసిన దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ… ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Breathe – డిసెంబరు 2 వస్తున్న ‘బ్రీత్’
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా… నందమూరి కళ్యాణ్‌రామ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనితో డిసెంబరు 2న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. టీజర్ ను బట్టి చూస్తే మెడికల్ మాఫియా నేపథ్యంలో సినిమా తెరకెక్కించారని అర్థం అవుతోంది. వైదిక సెంజలియా హీరోయిన్‌గా వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ ‘బ్రీత్’ సినిమాకు వైద్యో నారాయణో హరి అనే ట్యాగ్ లైన్ ఉంది.
Also Read : KTR : రష్మికపై కేటీఆర్ సరదా కామెంట్స్.. ఏమన్నాడంటే?