Hero Mahesh-Buchibabu Sana :మ‌హేష్ బాబుతో బుచ్చిబాబు స‌న మూవీ..?

రామ్ చ‌ర‌ణ్ పెద్ది సినిమా త‌ర్వాత ఎంట్రీ

Buchibabu Sana : ఒకే ఒక్క సినిమా తీసిన బుచ్చిబాబు స‌న(Buchibabu Sana) సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. విజ‌య్ సేతుప‌తి విల‌న్ రోల్ పోషించిన ఉప్పెన రికార్డ్ బ్రేక్ చేసింది. క‌లెక్ష‌న్ల పంట పండించేలా చేసింది. ఆ త‌ర్వాత గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముఖ్య భూమిక పోషిస్తున్న పెద్ది షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్స్ ఇస్తూ వ‌స్తున్నారు ద‌ర్శ‌కుడు. తాజాగా రిలీజ్ చేసిన పెద్ది గ్లింప్స్ కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. అద్భుతంగా చిత్రీక‌రించిన తీరుకు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.

Buchibabu Sana Movie with Mahesh Babu

దీనికి పెద్ది 2.0 పేరు పెట్టారు. టైటిల్ ను ఖ‌రారు చేశారు. ఇప్ప‌టికే రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగించింది. ఈ సినిమాపై బిగ్ హైప్ క్రియేట్ చేసింది. గ్లింప్స్ చుట్టూ బ‌జ్ ను మ‌రింత పెంచేలా చేసింది. టేకింగ్ , మేకింగ్ లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చాడు బుచ్చిబాబు స‌న‌. ఇప్ప‌టికే మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ లో బిగ్ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మ‌హేష్ బాబుకు సంబంధించి క‌థ‌ను సిద్దం చేసిన‌ట్లు స‌మాచారం.

ఇందుకు సంబంధించి త‌న‌తో కూడా చ‌ర్చ‌లు జ‌రిపాడ‌ని తెలిసింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత త‌దుప‌రి చిత్రం బుచ్చిబాబు స‌న‌తో జ‌త క‌ట్ట‌నున్న‌ట్లు టాక్. ఈ మూవీ రిలీజ్ అయ్యేందుకు కొన్నేళ్లు ప‌ట్ట‌వ‌చ్చ‌ని తెలిసింది. కాగా ఇప్ప‌టికే మ‌హేష్ బాబు న‌టించిన సుకుమార్ తీసిన నేనొక్క‌డినే చిత్రంలో సుకుమార్ కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు. త‌న‌తో చ‌నువు కూడా ఉంది.

Also Read : Operation Sindoor Sensational : పాకిస్తాన్ కు షాక్ ఆప‌రేష‌న్ సింధూర్ అటాక్

buchi babu sanaCinemaMahesh BabuUpdatesViral
Comments (0)
Add Comment