Calling Sahasra Movie Song : కాలింగ్ స‌హ‌స్ర సాంగ్ రిలీజ్

ఆక‌ట్టుకుంటున్న క‌నుల నీరు రాల‌దే

Calling Sahasra Movie Song : బుల్లి తెర‌పై త‌న ప్ర‌తిభా పాట‌వాల‌తో ఆక‌ట్టుకుంటున్న న‌టుడు సుడిగాలి సుధీర్. చాలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాడు. సినిమాల‌లో కూడా చేస్తున్నాడు. త‌న‌కు స‌పోర్ట్ ఇచ్చింది మాత్రం బ‌ల‌గం ద‌ర్శ‌కుడు, ప్ర‌ముఖ క‌మెడియ‌న్ వేణు అంటాడు. మొత్తంగా బుల్లితెర‌పై న‌వ్వులు పూయిస్తూ ఎంద‌రో అభిమానులను పొందాడు సుధీర్.

Calling Sahasra Movie Song Released

సినిమాలో కూడా న‌టించారు. తాజాగా కాలింగ్ స‌హ‌స్ర పేరుతో కొత్త చిత్రం వ‌స్తోంది. ఇందులో హీరో పాత్ర‌లో త‌ను న‌టిస్తుండ‌గా డాలీషా హీరోయిన్ గా చేస్తోంది. ఇద్ద‌రికీ సంబంధించి రొమాంటిక్ సాంగ్ హైలెట్ కానుంద‌ని అంటున్నాడు ద‌ర్శ‌కుడు అరున్ విక్కిరాలా.

ఈ చిత్రాన్ని విజేష్ , చిరంజీవి(Chirabjeevi), కాటూరి వెంక‌టేశ్వ‌ర్లు నిర్మించారు. త్వ‌ర‌లోనే దీనిని విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిపారు మూవీ మేక‌ర్స్. తాజాగా కాలింగ్ స‌హ‌స్ర‌కు సంబంధించి అప్ డేట్ వ‌చ్చింది.

క‌నుల నీరు రాల‌దే అంటూ హృద్యంగా సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. అంద‌రినీ అల‌రించేలా ఉంది. మొత్తంగా ఓ వైపు స్టార్ల సినిమాల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు కొత్త వారు. మ‌రి సుధీర్ మూవీ స‌క్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Also Read : Mrunal Thakur : క‌థ న‌చ్చితే వెబ్ సీరీస్ కు ఓకే

Comments (0)
Add Comment