Captain Miller Movie : కెప్టెన్ మిల్ల‌ర్ పై ఉత్కంఠ

ధనుష్ ముఖ్య పాత్ర

Captain Miller Movie : త‌మిళ సినిమా రంగంలో త‌న గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. వై దిస్ కొల‌వెరీ అంటూ దేశాన్ని,ప్ర‌పంచాన్ని ఉర్రూత లూగించాడు. అత‌డే ధ‌నుష్. త‌ను ఈ మ‌ధ్య‌నే ర‌జ‌నీకాంత్ కూతురితో విడాకులు తీసుకున్నాడు. సినిమా రంగం అన్నాక ఇలాంటివి మామూలే. వాళ్లు ఎవ‌రితోనూ ఎళ్ల కాలం ఉండ‌లేరు. కొద్ది మంది మాత్ర‌మే కొన‌సాగుతూ వ‌స్తున్నారు.

Captain Miller Movie Updates

తాజాగా ధ‌నుష్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని న‌టించిన కెప్టెన్ మిల్ల‌ర్(Captain Miller) పై న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించి విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మ‌ధ‌న్ కార్కీ డైలాగులు రాశాడు. ధ‌నుష్ తో పాటు సెంథిల్ త్యాగ‌రాజ‌న్ , అర్జున్ త్యాగ‌రాజ‌న్ , ప్రియాంక అరుల్ మోహ‌న్ న‌టించారు. మరో కీల‌క పాత్ర‌లో క‌న్న‌డ నాట దిగ్గ‌జ న‌టుడిగా పేరొందిన శివ రాజ్ కుమార్ న‌టించ‌డం విశేషం. ఇక మూవీకి జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందించారు. స‌త్య జ్యోతి ఫిలింస్ ప‌తాకంపై నిర్మించిన కెప్టెన్ మిల్ల‌ర్ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల కానుంది.

Also Read : Ala Ninnu Cheri : అల్లుకున్న అలా నిన్ను చేరి

Comments (0)
Add Comment