Tollywood Actors Shocking : టాలీవుడ్ న‌టులపై కేసు న‌మోదు

బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ చేశార‌ని

Tollywood Actors : హైద‌రాబ‌ద్ – హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. టాలీవుడ్(Tollywood) కు చెందిన ప్ర‌ముఖ న‌టీ న‌టుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ పై ఉక్కు పాదం మోపారు. ఇప్ప‌టికే 11 మంది యూట్యూబ‌ర్ల‌పై కేసు న‌మోదు చేశారు. వీటిని ప్ర‌మోట్ చేస్తూ ల‌క్ష‌లు వెన‌కేసుకున్నార‌ని, వీరి కార‌ణంగా ఎంతో మంది సూసైడ్ చేసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో ఆర్టీసీ ఎండీగా ఉన్న సీనియ‌ర్ కాప్ వీసీ స‌జ్జ‌నార్ బెట్టింగ్ యాప్స్ పై చైత‌న్యం చేస్తూ వ‌చ్చారు. ఆపై యూట్యూబ‌ర్స్, సినీ రంగానికి చెందిన వారిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

Tollywood Actors Shcoking Case

వాటి ప్ర‌మోష‌న్ ఆపాల‌ని లేక పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ అవినాష్ మహంతి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బెట్టింగ్ యాప్స్ ను గ‌త కొంత కాలంగా ఎవ‌రెవ‌రు ప్ర‌మోట్ చేశార‌నే దానిపై ఆరా తీశారు. దీంతో తీగ లాగితే డొంకంతా క‌దిలిన‌ట్లు చాలా మంది సెలిబ్రిటీలు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారిలో టాప్ హీరో, హీరోయిన్లు కూడా ఉండ‌డం విశేషం. గురువారం మియాపూర్ పోలీసులు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

టాలీవుడ్ కు చెందిన రానా ద‌గ్గుబాటి, విజ‌య్ దేవ‌ర‌కొండ, మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మి, ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీ‌ముఖి, న‌టి నిధి అగ‌ర్వాల్, ప్ర‌కాశ్ రాజ్ తో స‌హా మొత్తం 25 మందిపై కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే యూట్యూబ‌ర్ల‌కు విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. మ‌రో వైపు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి వివ‌రాలు కోరింది. దీని వెనుక మ‌నీ లాండ‌రింగ్ ప్ర‌మేయం ఉండి ఉంటుంద‌ని ఆరా తీస్తోంది. మొత్తంగా ఈ దందా న‌టీ న‌టుల మెడ‌కు చుట్టుకోవ‌డంతో టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read : రామ్ పోతినేని భాగ్య‌శ్రీ బోర్సే బిజీ

ActorsPolice CaseShockingTollywoodViral
Comments (0)
Add Comment