Chandra Mohan : విల‌క్ష‌ణ న‌టుడు చంద్ర‌మోహ‌న్

తిరుగులేని క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు

Chandra Mohan : తెలుగు సినిమాలో విషాద అలుముకుంది. 938కి పైగా చంద్ర‌మోహ‌న్(ChandraMohan) సినిమాల‌లో న‌టించారు. ఆయ‌న సాగించిన ప్ర‌స్థానం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చంద్ర‌మోహ‌న్ కు 83 ఏళ్లు. హీరోగా ప్రారంభ‌మై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ తో ముగిసింది.

Chandra Mohan No More

సాహిత్యం ప‌ట్ల మ‌క్కువ. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎవ‌ర‌మైనా ఏదో ఒక రోజు వెళ్లి పోవాల్సిందే. తెర నుండి నిష్క్ర‌మించాల్సిందేన‌ని వాపోయారు ప్ర‌ముఖ సినీ సంగీత ద‌ర్శ‌కుడు వందేమాత‌రం శ్రీ‌నివాస్.

రంగుల రాట్నం సినిమాతో త‌న సినీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. గ‌త 20 ఏళ్ల పాటు అంటే 2000 నుంచి నేడు చ‌ని పోయేంత వ‌ర‌కు తండ్రి పాత్ర‌ల్లో న‌టించారు.

అల్లు అర్జున్ , పూజా హెగ్డే న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రంలో గుర్తుండి పోయే వంట‌వాడి పాత్ర‌లో న‌టించారు. ఆ పాత్ర‌కు ఎన‌లేని పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది.

శ్రీ‌ను వైట్ల తీసిన ఢీ చిత్రంలో , ర‌వితేజ న‌టించిన డాన్ శ్రీ‌ను పాత్ర‌ల‌లో చంద్ర‌మోహ‌న్ ను ఎవ‌రూ మ‌రిచి పోలేరు. మొత్తంగా విల‌క్ష‌ణ న‌టుడిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్, కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read : Chandra Mohan SPB : బాలు అంటే చ‌చ్చేంత ఇష్టం

Comments (0)
Add Comment