Chari 111 Movie : వెన్నెల కిషోర్ హీరో గా మూవీ

చారి 111 గా నామ క‌ర‌ణం

Chari 111 Movie : టాలీవుడ్ లో క‌మెడియ‌న్ గా గుర్తింపు పొందారు వెన్నెల కిషోర్. ఆయ‌న ఇప్పుడు ప‌లు సినిమాల‌లో బిజీగా ఉన్నారు. తాజాగా వెన్నెల కిషోర్ ను హీరోగా అవ‌తారం ఎత్తారు. తాజాగా చారి 111 పేరుతో కొత్త చిత్రంలో న‌టించ‌నున్నారు.

ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా బ‌ర్క‌త్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇక ఈ ద‌ర్శ‌కుడు గ‌తంలో సుమంత్ తో మ‌ళ్లీ మొద‌లైంది సినిమా తీశారు. ఆ త‌ర్వాత వెన్నెల కిషోర్ తో మూవీ తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Chari 111 Movie Hero Vennela Kishore

ఇక సినిమాలో హీరోయిన్ ను కూడా ఎంపిక చేశారు మూవీ మేక‌ర్స్. సంయుక్త విశ్వ‌నాథ‌న్ న‌టించ‌నుంది వెన్నెల కిషోర్(Vennela Kishore) కు తోడుగా. వీరిద్ద‌రితో పాటు ముఖ్యమైన పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ముర‌ళీ శ‌ర్మ న‌టించ‌నున్నారు.

కాగా పూర్తిగా యాక్ష‌న్ , కామెడీ ప్ర‌ధానంగా సినిమాను తెర‌కెక్కించ నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ పూర్తిగా గూఢ‌చారి పాత్ర‌లో న‌టించ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రీక‌రించిన స‌న్నివేశాలు అద్భుతంగా వ‌చ్చాయ‌న్నారు నిర్మాత అదితి సోనీ.

బ్ర‌హ్మాజీ, స‌త్య‌, రాహుల్ ర‌వీంద్ర‌న్, పావ‌ని రెడ్డి, తాగుబోతు ర‌మేష్ కూడా న‌టిస్తుండ‌డం విశేషం. పాట‌లు రామ‌జోగయ్య శాస్త్రి రాస్తుండ‌గా సైమ‌న్ కె కింగ్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Ram Pothineni : డబుల్ ఇస్మార్ట్ పై రామ్ ఫోక‌స్

chari 111 movie vennela kishore actor
Comments (0)
Add Comment