Chhaava : విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన ఛావా(Chhaava) చిత్రం కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. వాలంటైన్ డే సందర్బంగా మూవీ మేకర్స్ మూవీని రిలీజ్ చేశారు. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.
Chhaava Movie Records
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఛావాను తెరకెక్కించాడు దర్శకుడు. భారీ బడ్జెట్ తో దీనిని నిర్మించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.
తూ హి తూ సాంగ్ టాప్ చార్జ్ లో కొనసాగుతోంది. ఇక ఛావా సినిమాకు సంబంధించి కేవలం 4 రోజులలోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఏకంగా రూ. 50 కోట్ల మార్క్ ను దాటేసింది.
17వ శతాబ్దంలో జరిగిన యధార్థ ఘటనకు దృశ్య రూపం ఇచ్చాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ప్రపంచ వ్యాప్తంగా భారీ జనాదరణ పొందుతోంది. దేశీయ పరంగా చూస్తే రెండో రోజు బాక్సాఫీస్ ప్రదర్శనలో 17.74 శాతం పెరుగుదలను చూసింది. రూ. 36.5 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను నిర్మాతలు రూ. 130 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. తొలి రోజు రూ. 31 కోట్లు కొల్లగొట్టింది.
ఈ చిత్రం ఇప్పటి వరకు 50.39 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. పూణేలో 89.25 శాతం, ముంబైలో 74.75 శాతం, హైదరాబాద్ లో 61.25 శాతం, చెన్నైలో 59.75 శాతం, బెంగళూరులో 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది ఛాయ చిత్రం.
Also Read : Aishwarya Rajesh Love :ప్రేమ అద్భుతం అందమైన నరకం