Hero Vicky Kaushal-Chhaava :ఛావా చిత్రంతో నా కోరిక తీరింది

హీరో విక్కీ కౌశ‌ల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Vicky Kaushal : మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ త‌న‌యుడు శంభాజీ మ‌హారాజ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కించిన చిత్రం ఛావా. ఇందులో కీల‌క‌మైన శంభాజీ పాత్ర‌లో విక్కీ కౌశ‌ల్(Vicky Kaushal) న‌టించ‌గా త‌న భార్య ఏసుబాయిగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రం ఊహించ‌ని రీతిలో భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.

Vicky Kaushal Comment about Chhaava

దేశ వ్యాప్తంగా, ఓవ‌ర్సీస్ లోనూ ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. చాలా మంది ప్రేక్ష‌కులు ఛావా సినిమాను చూసి కన్నీళ్లు పెడుతున్నారు. శంభాజీ మ‌హారాజ్ ధైర్య సాహ‌సాలు, త‌న రాజ్యం కోసం, ప్ర‌జ‌ల కోసం పోరాడిన తీరును క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈ సినిమా ఏకంగా రూ. 200 కోట్ల‌ను దాటేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా మూవీ మేక‌ర్స్ ప్ర‌పంచ ప్రేమికుల దినోత్స‌వం ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేసింది ఛావా చిత్రాన్ని. ఏకంగా ఈ సినిమా కోసం రూ. 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తీశారు. సినిమాను చూసిన ప్ర‌ధాని మోడీ కూడా క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. ఆనాటి మొఘ‌లుల ఆధిప‌త్యాన్ని ప్ర‌శ్నించాడు శంభాజీ మ‌హారాజ్.

ఛావా స‌క్సెస్ మీట్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు న‌టుడు విక్కీ కౌశ‌ల్. త‌న జీవితంలో ఒకే ఒక్క కోరిక ఉండేద‌ని అది ఏదో ఒక రోజు త‌ను న‌టించే సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ పేరు ఉండేలా చూడాల‌ని అనుకున్నాన‌ని, ఛావా చిత్రంతో అది తీరింద‌న్నాడు.

Also Read : Falcon Company Scam ఫాల్కన్ భారీ కుంభ‌కోణం జ‌నానికి శ‌ఠ‌గోపం

ChhaavaCinemaCommentsVicky KaushalViral
Comments (0)
Add Comment