Hero Chiranjeevi Movie : కొత్త హంగుల‌తో జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి

35 ఏళ్ల త‌ర్వాత తిరిగి ప్రేక్ష‌కుల ముందుకు మెగా మూవీ

Chiranjeevi : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర రావు. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా. త‌ను కీ రోల్ పోషించిన చిత్రం జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి. ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది అప్ప‌ట్లోనే. ఇక ఈ మ‌ధ్య‌న కొత్త ట్రెండ్ మొద‌లైంది టాలీవుడ్ లో. అదేమిటంటే టాప్ హీరోలు న‌టించిన పాత చిత్రాలు , బిగ్ హిట్ గా నిలిచిన వాటిని తిరిగి ప్రేక్ష‌కుల కోసం రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మ‌రో అప్ డేట్ వ‌చ్చేసింది.

Chiranjeevi-Jagadeka Veerudu Athiloka Sundari

రాఘ‌వేంద‌ర్ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని స‌రిగ్గా ఆనాడు అంటే 35 ఏళ్ల కింద‌ట 1990 మే 9న విడుద‌ల చేశారు. సేమ్ ఆ తేదీన ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకునేందుకు రానుంది. సుదీర్ఘ కాలం తర్వాత వ‌స్తుండ‌డంతో మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది ఈ మూవీ. అప్ప‌టికీ ఇప్ప‌టికీ మూవీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సాంకేతిక ప‌రంగా కీలకం కానుంది. ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభూతి మిగిల్చేలా చేశారు మూవీ మేక‌ర్స్ మ‌రోసారి.

ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికీ ఉండ‌గా ఇందులో అద్బుతమైన పాత్ర‌ను పోషించ‌డ‌మే కాకుండా ఓ మాన‌వా అంటూ అతిలోక సుంద‌రిగా గుండెల‌ను హ‌త్తుకునేలా చేసిన న‌టి శ్రీ‌దేవి ఇప్పుడు మ‌న మ‌ధ్య లేరు. ఆమె అనారోగ్యంతో క‌న్ను మూశారు. కానీ త‌ను న‌టించిన ఈ చిత్రం ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ మూవీగా పేరు తెచ్చుకుంది. సాంకేతిక ప‌రంగా భారీ మార్పులు చేశారు మూవీ మేక‌ర్స్. మ‌రోసారి రికార్డ్ బ్రేక్ చేసేందుకు రేపే థియేట‌ర్ల‌లోకి రానుంది. ఏ మేర‌కు రాణిస్తుందో వేచి చూడాలి.

Also Read : Hero Pawan-Hari Hara Veera Mallu :జూన్ 12న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు విడుద‌ల‌

ChiranjeeviCinemaTrendingUpdates
Comments (0)
Add Comment