Chiranjeevi : ఏళ్లవుతున్నా తనలో ఏ మాత్రం చేవ తగ్గలేదని నిరూపిస్తున్నాడు టాప్ హీరో, మెగాస్టార్ చిరంజీవి. తను గతంలో నటించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ఇటీవల టాలీవుడ్ లో అత్యంత జనాదరణ పొందిన సినిమాలు తిరిగి విడుదలవుతున్నాయి. ఇక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆనాడు బిగ్ సక్సెస్ అయ్యింది. అత్యధిక వసూళ్లు చేసింది. ఇందులో మెగాస్టార్(Chiranjeevi) తో పాటు అందాల రాశి , దివంగత శ్రీదేవి కీలక పాత్రల్లో నటించింది. 1990 మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రిలీజ్ అయ్యింది.
Chiranjeevi Jagadeka Veerudu Athiloka Sundari Movie
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 35 ఏళ్లవుతోంది. ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చలన చిత్ర రంగంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచి పోయింది. ఈ సమయంలో తిరిగి మరోసారి అలరించనుంది. రాఘేవంద్రరావు మేకింగ్, విన్సెంట్, కేఎస్ ప్రకాష్ ల కెమెరా పనితనం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. బిగ్ సక్సెస్ అయ్యేలా చేసింది. అంతే కాకుండా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అద్భుతమైన పాటలు , సంగీతం ఇచ్చాడు ఈ మూవీ కోసం.
అయితే రీ రిలీజ్ కు సంబంధించి దర్శక, నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు చేశారు. ఇందులో సరికొత్త హంగులు జోడించారు. ప్రస్తుతం సినిమాలో టెక్నాలజీ మారింది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి త్రీడీలోకి మార్చారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను జనం ఆదరిస్తున్నారు. మెగాస్టార్ , శ్రీదేవి నటనకు ఫిదా అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. ఆనాడు వసూళ్లలో రికార్డ్ సృష్టిస్తే రీ రిలీజ్ లో కూడా దంచి కొడుతుండడం విశేషం.
Also Read : Operation Sindoor Sensational :ఆపరేషన్ సిందూర్ ఫస్ట్ లుక్ అదుర్స్