Hero Chiranjeevi : చిరంజీవికి జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం

యుకె పార్ల‌మెంట్ లో బ‌హూక‌ర‌ణ

Chiranjeevi : టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi) అరుదైన గౌర‌వం ద‌క్కింది. యుకె పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న‌కు ప్ర‌క‌టించిన జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌న జీవితంలో ఇలాంటి అవార్డు త‌న‌కు విదేశాల‌లో ద‌క్కుతుంద‌ని అనుకోలేద‌న్నారు. ఇది మ‌రిచి పోలేనంటూ పేర్కొన్నారు. ఈ పుర‌స్కారం పొంద‌డంతో త‌న‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింద‌ని చెప్పారు చిరంజీవి.

Chiranjeevi Receives Lifetime Achievement

గ‌త ఏడాది 2024లో కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో అత్యున్న‌త రెండో పౌర పుర‌స్కారం ప‌ద్మ విభూష‌ణ్ ను అందుకున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొన‌సాగుతున్నారు. ఎంతో మంది యువ హీరోలు ఎంట్రీ ఇస్తున్నా వారితో తాను కూడా పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం విశ్వంభ‌ర మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. త్వ‌ర‌లో ఆయ‌న మినిమం డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో నూత‌న చిత్రం చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే క‌థ‌కు కూడా ఓకే చెప్పారు. ఆయ‌న స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్లు ఉండ‌నున్న‌ట్లు టాక్. వారిలో ఒక‌రు హైద‌రీ కాగా మ‌రొక‌రు భూమిక చావ్లా. ఇందులో డ్యూయ‌ల్ రోల్ పోషించ‌నున్నారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాదిలో త‌ను అందుకున్న గొప్ప అవార్డు కావ‌డం విశేషం. ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా కేవ‌లం స్వ‌యం కృషితో పైకి వ‌చ్చారు . ఆయ‌న ఎంద‌రికో స‌పోర్ట్ గా నిలుస్తూ వ‌చ్చారు. త‌న కుటుంబం నుంచి కూడా హీరోలు ఉన్నారు. వారిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు, కొడుకు రామ్ చ‌ర‌ణ్, నాగ‌బాబు కూతురు నిహారిక ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్నారు. ఇక మేన‌ల్లుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. మొత్తంగా మెగాస్టార్ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు.

Also Read : టాలీవుడ్ న‌టులపై కేసు న‌మోదు

Mega Star ChiranjeeviUpdatesViral
Comments (0)
Add Comment