Chiranjeevi Sensational :మా తాత మంచి ర‌సికుడు – చిరంజీవి

ఆడ‌పిల్ల‌ల‌పై నోరు జారిన మెగాస్టార్

Chiranjeevi : ఆయ‌న టాలీవుడ్ లో సూప‌ర్ స్టార్. ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్న న‌టుడు. ఏ పాత్ర అయినా స‌రే ఇట్టే ఒదిగి పోయే ల‌క్ష‌ణం క‌లిగిన వ్య‌క్తి. చాలా మ‌టుకు సౌమ్యంగా క‌నిపిస్తూ త‌న ప‌ని ఏదో తాను చేసుకుంటూ పోయే ర‌కం. ఆ మ‌ధ్య‌న ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించాడు. సీఎం కావాల‌ని అనుకున్నాడు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. పార్టీని కాంగ్రెస్ పార్టీలో క‌లిపేశాడు. కేంద్ర కేబినెట్ లో చోటు సంపాదించాడు.

Chiranjeevi Sensational Comments

ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌లో త‌న‌కు స‌రిపోద‌ని తిరిగి సినిమాల్లో స్థిర‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. వ‌రుస‌గా మూవీస్ చేస్తూ యంగ్ యాక్ట‌ర్స్ తో పోటీ ప‌డుతున్నారు. ఆ మ‌ధ్య‌న బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య మూవీలో ఇరగ‌దీశాడు. ఆచార్య కొంచెం బెడిసి కొట్టింది. ప్ర‌స్తుతం విశ్వంభ‌ర మూవీలో న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే మినిమం గ్యారెంటీ క‌లిగిన ద‌ర్శ‌కుడిగా పేరొందిన అనిల్ రావిపూడికి ఓకే చెప్పాడు.

తాజాగా క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం న‌టించిన బ్ర‌హ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఉన్న‌ట్టుండి మ‌హిళ‌ల గురించి మాట్లాడాడు. త‌న‌కు ఆడ‌పిల్ల వ‌ద్ద‌ని ఓ మ‌న‌వ‌డు కావాల‌ని కోరిక ఉంద‌న్నాడు. దీంతో మ‌హిళా లోకం భ‌గ్గుమంటోంది. ఇదే స‌మ‌యంలో నోరు పారేసుకున్నాడు. త‌న తాత మంచి ర‌సికుడ‌ని, ఇంట్లో ఇద్ద‌రు ఉండే వార‌ని, వారితో స‌రిపోక పోతే బ‌య‌ట ఇంకొక‌రితో క‌లిసి వ‌చ్చే వాడంటూ పేర్కొన్నాడు. మొత్తంగా చిరంజీవి(Chiranjeevi) చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : త‌న కాళ్లు ప‌ట్టుకునేందుకు సిద్ధం

CommentsMegastar ChiranjeeviShockingViral
Comments (0)
Add Comment