Chourya Patham Interesting :ఆస‌క్తి రేపుతున్న చౌర్య పాఠం 

క్రైమ్ కామెడీ డ్రామాతో క‌థ 

Chourya Patham : ధ‌మాకా, మ‌జాకా సినిమాల‌తో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌. త‌ను ద‌ర్శ‌క‌త్వం కాకుండా ఇప్పుడు కొత్త‌గా మూవీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ తో అడుగు పెడుతున్నాడు. ఇంద్రా రామ్ ను హీరోగా ప‌రిచయం చేశాడు. నిఖిల్ గొల్ల‌మారి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ లో ప‌రిచ‌యం అవుతున్నాడు. మూవీ మేక‌ర్స్ చౌర్య పాఠం(Chourya Patham) ట్రైలర్ ను విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ కు సూప‌ర్ టాక్ వ‌చ్చింది. ఊహించ‌ని రీతిలో అంచ‌నాలు పెంచేలా చేసింది.

Chourya Patham Movie Viral

ఇదిలా ఉండ‌గా ఏప్రిల్ 25న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు ద‌ర్శ‌కుడు. క‌థ విష‌యానికి వ‌స్తే ఇది వినోదాత్మ‌కంతో కూడిన బ్యాంకు దోపిడీ క‌థ‌. ట్రైల‌ర్ పూర్తిగా వినోదాత్మ‌కంగా ఉంది. అయితే హాలీవుడ్ సీరిస్, సినిమాల నుండి ప్రేర‌ణ పొందామ‌ని ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు చెప్ప‌డం విశేషం. చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు త్రినాథ‌రావు మ‌క్కిన‌.

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే బ్యాంక్ దోపిడీ నేప‌థ్యంగా సాగుతుంది. ఇది ఒక గ్రామంలో జ‌రుగుతంది. హీరో నాలుగు విష‌యాలు చెప్ప‌డం ఇందులో ట్విస్ట్. డాక్యుమెంట‌రీ నిర్మాత‌ల‌మంటూ న‌మ్మించాలి. వాకీ టాకీ వాడాలి. కోడ్ భాష‌లో మాత్ర‌మే మాట్లాడాలి. చివ‌ర‌కు దోపిడీ విజ‌య‌వంత‌మైందా లేదా అనేది క‌థ ముఖ్యాంశం. ఇంద్ర రామ్ స్టైలిష్ గా క‌నిపిస్తుండ‌గా పాయ‌ల్ రాధాకృష్ణ ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది.

Also Read : Hero Sivakarthikeyan-Trivikram :శివ కార్తికేయ‌న్ డిమాండ్ త్రివిక్ర‌మ్ షాక్

Chourya PathamCinemaUpdatesViral
Comments (0)
Add Comment