Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’ నుండి పాటను విడుదల చేసిన జయప్రకాష్ నారాయణ !

‘కమిటీ కుర్రోళ్ళు’ నుండి పాటను విడుదల చేసిన జయప్రకాష్ నారాయణ !

Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌ పై రూపొందుతున్న తాజా సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ సిద్ధమౌతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గొర్రెలా..’ అనే సాంగ్‌ను జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా విడుదల చేశారు.

Committee Kurrollu Movie Updates

ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.. రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అన్వేషిస్తున్నాయి. ఓట్లను డబ్బులతో కొంటున్నారు… మందు, చీరలిచ్చి ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు… ఓట్లను కొనేసి తర్వాతే ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ… గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయాలంటూ చెబుతున్నారు ‘కమిటీ కుర్రోళ్ళు’. ‘గొర్రెలా..’అంటూ సాగే ఈ పాటను అనుదీప్ దేవ్ సంగీత సారథ్యంలో నాగ్ అర్జున్ రెడ్డి రాశారు. అనుదీప్ దేవ్, వినాయక్, అఖిల్ చంద్ర, హర్షవర్ధన్ చావలి, ఆదిత్య భీమతాటి, సింధూజ శ్రీనివాసన్, మనీషా పండ్రాంకి, అర్జున్ విజయ్ పాడారు.

ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ(Jaya Prakash Narayana) మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్ళు(Committee Kurrollu)’ సినిమాలో ‘గొర్రెలా..’ అనే పాట పెట్టి ఊర్రుతలూగించారు. అలాగే యువతను ఆలోచింపజేశారు. దేశ భవిష్యత్తును కాపాడాలంటే యువతలో సరైన ఆలోచన ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేసీగా, ఉత్సాహంగా, ఆలోచనాత్మకంగా చక్కటి పాటను చిత్రీకరించారు. నిర్మాత నిహారిక, డైరెక్టర్ వంశీ, పాట రాసిన నాగార్జున, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్‌లకు ఈ సందర్భంగా మనసారా అభినందిస్తున్నా. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయాలని యువత సహా అందరినీ కోరుతున్నా అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘మా సినిమాలో పాటను విడుదల చేసినందుకు ముందుగా జయప్రకాష్ నారాయణగారికి థాంక్స్ చెబుతున్నాను. నిజానికి జయప్రకాష్ గారు మాట్లాడిన ఓ స్పీచు వినే మా డైరెక్టర్ వంశీ సినిమాను స్టార్ట్ చేశారని ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నాను. జయప్రకాష్ గారికి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం’ అన్నారు.

Also Read : Prathinidhi 2: సెన్సార్ పూర్తిచేసుకున్న ‘ప్రతినిధి 2’ !

Committee KurrolluJayaprakesh NarayananNiharika Konidela
Comments (0)
Add Comment