Court Sensational Collection :ఓవ‌ర్సీస్ లోనూ కోర్ట్ క‌లెక్ష‌న్స్ అదుర్స్

యుఎస్ లో నాగ చైత‌న్య థండేల్ ను దాటేసింది

Court : న‌టుడు నాని నిర్మించి, స‌మ‌ర్పించిన చిత్రం కోర్ట్. పోక్సో చ‌ట్టంపై ఫోక‌స్ పెడుతూ క‌థ‌ను దాని చుట్టూ అల్లిన సినిమా ఇది. ఎవ‌రూ ఊహించ లేదు ఈ మూవీని ఇంత‌గా ఆద‌రిస్తార‌ని. చాన్నాళ్ల త‌ర్వాత ఈ చిత్రం ద్వారా తిరిగి తెర‌పై త‌న న‌ట‌న‌తో స‌త్తా చాటాడు శివాజీ. ఈ సంద‌ర్బంగా జీవితంలో త‌న‌ను మ‌రిచి పోలేనంటూ నానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక స‌హ‌జ సిద్ద‌మైన న‌ట‌న‌కు పెట్టింది పేరు తెలంగాణ‌కు చెందిన ప్రియ‌ద‌ర్శి. హ‌ర్ష వ‌ర్ద‌న్, శ్రీ‌దేవి అపల్ల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక కోర్ట్(Court) చుట్టూ అల్లుకున్న ఈ క‌థ క‌ట్టి ప‌డేసింది. ప్రేక్ష‌కుల‌ను సినిమా చూసేలా చేసింది.

Court Movie Collections

ఇందుకు ప్ర‌త్యేకంగా అభినందించాల్సింది ద‌ర్శ‌కుడు రామ్ జ‌గ‌దీశ్. మ‌నోడిలో ఆ క‌సి ఉండ‌డం వ‌ల్ల‌నే సినిమాను ఇంత బాగా తీయ‌గ‌లిగాడు. అతి త‌క్కువ బ‌డ్జెట్ తో తీసిన కోర్ట్ ఇప్పుడు బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. విచిత్రం ఏమిటంటే ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ లేకుండానే రిలీజైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో ఓటీటీలో భారీ ధ‌ర పలికింది. నెట్ ఫ్లిక్స్ ఏకంగా కోర్ట్ ను రూ. 8 కోట్ల‌కు చేజిక్కించుకుంది. దీంతో నిర్మాత నాని ఫుల్ ఖుస్ లో ఉన్నాడు.

ఆ మ‌ధ్య‌న ఈవెంట్ జ‌రిగిన సంద‌ర్బంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఈ సినిమా చూడండి ఒక‌వేళ న‌చ్చ‌క పోతే త‌న హిట్ 3 మూవీని చూడ‌కండి అంటూ చెప్పాడు. ఇది కూడా బాగా క‌నెక్ట్ అయ్యేలా చేసింది. ఇక కోర్ట్ ఇండియాలోనే కాదు ఓవ‌ర్సీస్ లో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించిన థండేల్ చిత్రం చేసిన వ‌సూళ్ల‌ను అమెరికాలో అధిగ‌మించింది కోర్ట్. దాదాపు 9 ల‌క్ష‌ల‌కు పైగా డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది. విస్తు పోయేలా చేసింది.

Also Read : Upasana Gift – Janhvi RC16 :ఉపాస‌న బ‌హుమానం జాన్వీ సంతోషం

CinemaCollectionsCourtPriyadarshi PulikondaSivajiTrending
Comments (0)
Add Comment