Hero Vijay-Varun Chakravarthy :ద‌ళ‌ప‌తి విజ‌య్ అంటే చ‌చ్చేంత ఇష్టం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క్రికెట‌ర్

Vijay : భార‌తీయ స్టార్ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌ను ఈ మ‌ధ్య సంచ‌ల‌నంగా మారాడు. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీలో దుమ్ము రేపాడు. అద్భుత‌మైన ప‌ర్ ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. అంతే కాదు భార‌త జ‌ట్టు విజేత‌గా నిల‌వ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించాడు. త‌న బౌలింగ్ మంత్ర‌జాలంతో ప్ర‌త్య‌ర్థులకు చుక్క‌లు చూపించాడు. ప్ర‌ధాన ఆట‌గాళ్ల‌ను పెవిలియ‌న పంపించాడు. మోస్ట్ ఫెవ‌ర‌బుల్ స్పిన్న‌ర్ గా అవ‌త‌రించాడు. త‌ను ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ గా టాప్ క్రికెట‌ర్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు.

Vijay Thalapathy-Varun Chakvarthy

ఈ త‌రుణంలో చిట్ చాట్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. త‌మిళ సినీ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడిగా గుర్తింపు పొందాడు ద‌ళ‌ప‌తి విజ‌య్(Vijay). త‌ను గ‌త ఏడాది ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో టీవీకే పార్టీని ఏర్పాటు చేశాడు. త‌ను చేప‌ట్టిన స‌భ‌కు ఏకంగా 10 ల‌క్ష‌ల మందికి పైగా జ‌నం హాజర‌య్యారు. దేశ చ‌రిత్ర‌లో ఇది ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ఆఖ‌రి చిత్రంలో న‌టిస్తున్నాడు. షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సంద‌ర్బంగా మాట్లాడిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్ అంటే చ‌చ్చేంత ఇష్ట‌మ‌ని చెప్పాడు. అంతే కాదు త‌న పేరుతో ట‌టూ కూడా వేయించుకున్నాన‌ని తెలిపాడు. త‌న న‌ట‌న‌, మేన‌రిజం అంటే ప్రేమ అన్నాడు. అంతే కాదు ఏదో ఒక రోజు విజ‌య్ హీరోగా ఓ సినిమా కూడా చేయాల‌ని అనుకున్నాన‌ని చెప్పాడు. ఇందుకోసం కొన్ని క‌థ‌లు కూడా సిద్దం చేసుకున్నాన‌ని, వాటిని తానే రాశాన‌ని అన్నాడు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, కామెంట్స్ నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి.

Also Read : Popular Music Director AR Rahman :రెహమాన్ కు అశ్వ‌స్థ‌త ఆస్ప‌త్రిలో చేరిక‌

TrendingUpdatesVarun ChakvarthyVijay Thalapathy
Comments (0)
Add Comment