Hero Balayya-Daaku Maharaaj : డాకు మ‌హారాజ్ వ‌సూళ్లలో రికార్డ్

బాల‌య్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్

Daaku Maharaaj : నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ , ఊర్వ‌శి రౌటేలా, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ క‌లిసి న‌టించిన డాకు మ‌హారాజ్(Daaku Maharaaj) వ‌సూళ్ల‌లో రికార్డుల మోత మోగిస్తోంది. తొలి రోజు రూ. 56 కోట్ల గ్రాస్ ను క‌లెక్ట్ చేసింది. రెండో రోజూ కూడా అదే దూకుడు కొన‌సాగిస్తోంది. మ‌రోసారి త‌న స్టామినా ఏమిటో చూపించారు బాల‌య్య‌.

Daaku Maharaaj Collections

ముఖ్యంగా సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ థ‌మ‌న్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇక బాల‌య్య న‌ట విశ్వ‌రూపం మ‌రోసారి ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు. ఒక ర‌కంగా చెప్పాలంటే అన్నీ తానై సినిమాను న‌డిపించాడు. సెంటిమెంట్, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో అద‌రగొట్టాడు.

ఓ వైపు విక్ట‌రీ వెంక‌టేశ్ ఎఫ్ 2 , ఎఫ్ 2 , సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాల‌తో హ్యాట్రిక్ కొడితే నంద‌మూరి బాల‌కృష్ణ వీర సింహా రెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి, డాకు మ‌హారాజ్ తో సూప‌ర్ హిట్ కొట్టాడు. టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌లైన ఈ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. వ‌సూళ్ల‌తో నిర్మాత‌ల‌కు తెగ సంబురాలు మిగిల్చేలా చేశాయి.

మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీర‌య్య సినిమా తీసిన ద‌ర్శ‌కుడు బాబీ మ‌రోసారి త‌న మార్క్ చూపించే ప్ర‌య‌త్నం చేశాడు బాల‌య్య బాబుతో డాకు మ‌హారాజ్. బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈనెల 12న విడుద‌లైన ఈ చిత్రం బాక్సులు బ‌ద్ద‌లు కొట్టే ప‌నిలో ప‌డింది. మొత్తంగా బాల‌య్యా మ‌జాకా అంటున్నారు సినీ ఫ్యాన్స్.

Also Read : Hero Thalaiva-Jailer 2 : జైల‌ర్ -2 సీక్వెల్ మూవీ ప్రోమో రిలీజ్

Comments (0)
Add Comment