Daasi Sudarshan: జాతీయ అవార్డ్‌ గ్రహీత ‘దాసి’ సుదర్శన్‌ మృతి !

జాతీయ అవార్డ్‌ గ్రహీత 'దాసి' సుదర్శన్‌ మృతి !

Daasi Sudarshan: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ నుంచి నేషనల్‌ అవార్డ్‌ అందుకున్న దాసి సుదర్శన్‌ (73) మరణించారు. 1988లో ‘దాసి(Daasi)’ సినిమాకు గాను ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న పిట్టంపల్లి సుదర్శన్‌ ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆ సినిమా వల్ల ‘దాసి()’ సుదర్శన్‌ గా గుర్తింపు పొందారు. సుదర్శన్‌ అంత్యక్రియలు మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Daasi Sudarshan No More

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చిత్రకారుడు దాసి సుదర్శన్‌(Daasi Sudarshan)… జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చారు. మిర్యాలగూడ స్వస్థలమైనప్పటికీ ఉపాధ్యాయ వృత్తిరీత్య నాగార్జున్‌ సాగర్‌ లోని హిల్‌ కాలనీలోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్‌ టీచర్‌ గా తన జర్నీని ప్రారంభించారు. ఆ తర్వాత కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా, రచయితగా, పాత్రికేయుడిగా, ఫొటోగ్రాఫర్‌ గా,కార్టూనిస్టుగా కూడా ప్రసిద్ధికెక్కారు.

1988 లో విడుదలైన తెలుగు సినిమా దాసి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు తెరకెక్కించారు. అలనాటి తెలంగాణలో దొరల నిరంకుశ పాలనలో చితికిపోయిన గ్రామ ప్రజల జీవితాలను ఈ సినిమాలో ప్రతిబింబారు దర్శకుడు. భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తూ ఆద్యంతం వాస్తవికధోరణిలో రూపొందించబడింది. ఈ చిత్రానికి దు జాతీయ అవార్డులను దక్కించుకోగా అందులో సుదర్శన్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా అవార్డు పొందారు. ఆ తర్వాత జాతీయ అవార్డుల జ్యూరీలో సభ్యులుగా కూడా ఆయన పనిచేశారు.

Also Read : Thalaivar 171: ‘తలైవా171’ సినిమా టైటిల్ ‘కళుగు’ ?

Daasi SudarshanTollywood
Comments (0)
Add Comment