Hero Nithin Robinhood Promotions : రాబిన్ హుడ్ ప్ర‌మోష‌న్ లో వార్న‌ర్ బిజీ

హైద‌రాబాద్ కు చేరుకున్న స్టార్ క్రికెట‌ర్

Robinhood : ఆస్ట్రేలియ‌న్ స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఇప్పుడు ఆట‌తో పాటు సయ్యాట‌కు రెడీ అయ్యాడు. త‌న కెరీర్ లో ఉన్న‌ట్టుండి సినీ రంగంపై ఫోక‌స్ పెట్టాడు. అది త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన టాలీవుడ్ కు సంబంధించిన మూవీలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ మేర‌కు ఆస్ట్రేలియా నుంచి సినిమా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనేందుకు విచ్చేశాడు. ఆయ‌న‌కు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు మూవీ మేక‌ర్స్. ఇదిలా ఉండ‌గా ఫుల్ బిజీగా మారాడు వార్న‌ర్(David Warner). ఓ వైపు ఐపీఎల్ 2025 కొన‌సాగుతోంది. మ‌రో వైపు డేవిడ్ తాను న‌టించిన రాబిన్ హుడ్(Robinhood) చిత్రానికి సంబంధించి హీరో నితిన్ రెడ్డి, న‌టి శ్రీ‌లీల‌, ఇత‌ర తారాగ‌ణంతో క‌లిసి హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు.

David Warner Busy with Robinhood Movie Promotions

ఇదిలా ఉండ‌గా రాబిన్ హుడ్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. చిత్రం విడుద‌లకు సిద్దంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇక చంద్ర‌బోస్ రాసిన స్పెష‌ల్ సాంగ్ కాంట్రావ‌ర్సీకి గురైంది. దీనిని శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు. త‌మిళ సినీ రంగానికి చెందిన టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్, న‌టుడు జీవీ ప్ర‌కాశ్ కుమార్ రాబిన్ హుడ్ కు సంగీతం అందించారు. పాట‌లు మాత్రం కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఇక ప్ర‌త్యేక సాంగ్ లో కేత‌కి శ‌ర్మ న‌టించింది.

అయితే రాబిన్ హుడ్ మూవీకి డేవిడ్ వార్న‌ర్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా మార‌నున్నాడ‌ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. త‌న కెరీర్ లో ఇదే తొలి మూవీ కావ‌డంతో జోష్ లో ఉన్నాడు క్రికెట‌ర్. ఇక ట్రైల‌ర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ కు విచ్చేశాడు. గ‌తంలో త‌ను పాపుల‌ర్ తెలుగు మూవీ సాంగ్స్ కు త‌న ఫ్యామిలీతో క‌లిసి రీల్స్ చేశాడు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాడు. ఇప్పుడు మూవీలో కూడా న‌టిస్తుండ‌డంతో రాబిన్ హుడ్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో న‌టించినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు. నిన్న‌టి దాకా మైదానంలో మెరిశాడు..ఇప్పుడు వెండి తెర‌పై దుమ్ము రేపేందుకు రెడీ అయ్యాడంటూ క్యాప్ష‌న్ కూడా జోడించారు. మొత్తంగా రాబిన్ హుడ్ మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read : Hero Balakrishna-Harish Shankar :బాల‌య్య‌తో హ‌రీశ్ శంక‌ర్ మూవీ..?

CinemaPromotionsRobinhoodTrendingUpdates
Comments (0)
Add Comment