Ketika : ప్రపంచ క్రికెట్ లో టాప్ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్. మనోడికి తెలుగు ప్రజలతో దగ్గరి అనుబంధం ఉంది. ఎందుకంటే తను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చాలా కాలం ప్రాతినిధ్యం వహించాడు. మనోడికి టాలీవుడ్ సినిమాలంటే పిచ్చింది. ఆయా స్టార్స్ నటించిన మూవీస్ లోని పాపులర్ సాంగ్స్, డైలాగ్ లతో రీల్స్ చేశాడు. ఫేమస్ అయ్యాడు. వార్నర్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Ketika Sharma-David Warner Dance Viral
ఒక్కసారి చూశాడంటే ఇక వెంటనే రీల్ చేస్తాడు. ఆ క్షణమే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటాడు. దీంతో తనకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. ఇన్ స్టా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని ప్రత్యేకంగా గమనించారు మైత్రీ మూవీ మేకర్స్ . ఈ మేరకు తన అభిరుచికి తగినట్టుగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాము తీసిన రాబిన్ హుడ్ మూవీలో నటించే ఛాన్స్ ఇచ్చారు. ఈ సందర్బంగా మరోసారి దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాడు డేవిడ్ వార్నర్(David Warner). తనను అందరూ ముద్దుగా వార్నర్ మామ అని పిలుచుకుంటారు. తాజాగా హైదరాబాద్ వేదికగా రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది.
ఈ బిగ్ ఈవెంట్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు వార్నర్. ఇదే సమయంలో నటీ నటులు నితిన్ రెడ్డి, శ్రీలీల, కేతికా శర్మతో పాటు దర్శకుడు వెంకీ కుడుముల ప్రత్యేకంగా నిలిచారు. స్టేజ్ పైకి రాగానే తనదైన శైలిలో స్పందించాడు డేవిడ్ వార్నర్. స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసి తన అంద చందాలతో కిర్రాక్ తెప్పించేలా చేసిన బాలీవుడ్ బ్యూటీ కేతికా శర్మ, లవ్లీ బ్యూటీ శ్రీలీలతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం వార్నరా మజాకా అంటున్నారు.
Also Read : Robinhood Trailer Sensational :రాబిన్ హుడ్ ట్రైలర్ రచ్చ రచ్చ