ఉత్కంఠకు తెర దించాడు తమిళ సూపర్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్. భారీ నిర్మాణంతో ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఏఏ22 పేరుతో చిత్రానికి శ్రీకారం చుట్టింది సన్ మూవీ మేకర్స్ అధినేత, డీఎంకే ఎంపీ దయానిధి మారన్. భారతీయ సినీ చరిత్రలో ఇదే భారీ ఖర్చు అని టాక్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి వీడియోను కూడా రిలీజ్ చేశాడు అట్లీ. తను ఏది చేసినా సంచలనమే.
బన్నీ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందనే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇందుకు సంంబంధించి ఇవాళ అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు అట్లీ కుమార్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప -2 మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇండియన్ హిస్టరీలో అత్యధికంగా కలెక్షన్స్ సాధించింది. ఏకంగా రూ. 1867 కోట్లు వసూలు చేసింది. సెన్సేషన్ క్రియేట్ చేసింది.
హీరోయిన్ గా కన్ ఫర్మ్ చేశాడు దర్శకుడు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు పొందిన దీపికా పదుకొనేను ఎంపిక చేసినట్లు వెల్లడించాడు అట్లీ కుమార్. పూర్తి ప్రిపరేషన్ మోడ్‌లోకి సజావుగా మారడం – విస్తృతమైన తలపాగా ధరించి సెట్ లోకి అడుగు పెట్టిన ఫోటోను రిలీజ్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక అట్లీ విషయానికి వస్తే తను బాద్ షా షారుక్ ఖాన్ తో జవాన్ తీశాడు. ఇది రూ. 1000 కోట్లు వసూలు చేసింది. తను జవాన్, తేరి, బిగిల్, మెర్సల్ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లు సినిమాలు తీశాడు. ఇక సినీ నిర్మాణ సంస్థలలో టాప్ లో పేరు పొందింది సన్ టీవీ నెట్ వర్క్.
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత శక్తివంతమైన, బహుముఖ ప్రజ్ఞాశాలి నటిగా గుర్తింపు పొందారు దీపికా పదుకొనే . విచిత్రం ఏమిటంటే ఇంకా షూటింగ్ కాకుండానే బన్నీ, అట్లీ మూవీ ఏకంగా రూ. 1000 కోట్ల మార్కెట్ ను సాధించినట్లు టాక్.