Hero Prabhas-Deepika :వంగా మూవీలో ప్ర‌భాస్..దీపికా ప‌దుకొనే

స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తి..అనుమానాల‌కు స్టాప్

Prabhas : పాన్ ఇండియా డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. త‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సీని అర్జున్ రెడ్డి సూప‌ర్. హిందీలో షాహిద్ క‌పూర్ తో తీసిన మూవీ అదుర్స్. కొంత గ్యాప్ త‌ర్వాత ర‌ణ‌బీర్ క‌పూర్, ర‌ష్మిక మంద‌న్నా, అనిల్ క‌పూర్, బాబీ డియోల్ తో తీసిన యానిమ‌ల్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ ను షేక్ చేసింది. ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లు సాధించింది. ఇది ర‌ణ‌బీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Prabhas Sandeep Reddy Vanga Movie Deepika Padukone Key Role

ఆ త‌ర్వాత ఎవ‌రితో సినిమా తీస్తాడ‌నే దానిపై ఉత్కంఠ‌కు తెర దించాడు ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి. పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్(Prabhas) తో సినిమా తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే స్పిరిట్ పేరుతో టైటిల్ ను ఖ‌రారు చేశాడు. స్క్రిప్ట్ పూర్త‌యింద‌ని, త‌న‌కు ప్ర‌భాస్ 65 రోజుల పాటు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరాడు. దీనికి హీరో కొంత ఇబ్బంది ప‌డ్డాడ‌ని, సినిమా ఇప్ప‌ట్లో రాదంటూ పెద్ద ఎత్తున సినీ రంగంలో వార్త‌లు వినిపించాయి. దీనిపై తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు వంగా సందీప్ రెడ్డి.

కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. బాలీవుడ్ క్వీన్ దీపికా ప‌దుకొనే గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌ను న‌టించిన ప్ర‌తి మూవీ సూప‌ర్ హిట్ అయ్యింది. త‌ను ప్ర‌భాస్ తో ఇప్ప‌టికే క‌ల్కి మూవీ చేసింది. దీనిని నాగ్ అశ్విన్ తీశాడు. ఇది కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ త‌రుణంలో వంగా సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీలో ప్ర‌భాస్ తో స్క్రీన్ మ‌రోసారి షేర్ చేసుకుంటోంద‌ని ప్ర‌క‌టించాడు డైరెక్ట‌ర్. ఇప్ప‌టికే దీపికా ప‌దుకొనే ప‌లు సినిమాల‌కు కాంట్రాక్ట్ చేసింది.

Also Read : Hero Vijay-Anirudh : అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది

CinemaDeepika PadukonePrabhasSandeep Reddy VangaUpdatesViral
Comments (0)
Add Comment