Hero Dhanush-Kuberaa :కుబేర మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ర‌ష్మిక మంద‌న్న..ధ‌నుష్ కీ రోల్

Kuberaa : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త క‌లిగిన ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. త‌ను తీసే సినిమా ఇత‌ర దర్శ‌కుల కంటే భిన్నంగా ఉంటుంది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన అభిమానులు ఉన్నారు. ఆయ‌న నుంచి వ‌చ్చే చిత్రం కోసం ఎంత‌గానో ఆస‌క్తితో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ త‌రుణంలో త‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం కుబేర‌. ఇందులో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు త‌మిళ మీరో ధ‌నుష్ తో పాటు జ‌త‌గా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న.

Kuberaa Movie Release Updates

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సాయి ప‌ల్ల‌వి ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ స్టార్ ఇమేజ్ క‌లిగిన ర‌ష్మిక ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ లేదు. విచిత్రం ఏమిటంటే కుబేర చిత్రం షూటింగ్ శ‌రవేగంగా కొన‌సాగుతోంది. భారీ అంచ‌నాలు ఉన్నాయి ఈ మూవీపై. ఇందులో మ‌రో కీల‌క పాత్ర పోషిస్తున్నారు ప్ర‌ముఖ న‌టుడు, హోస్ట్ అక్కినేని నాగార్జున‌. ఇదే స‌మ‌యంలో కుబేర(Kuberaa) చిత్రం ప్ర‌మోష‌న్స్ పెంచారు.

ఇదిలా ఉండ‌గా కుబేర‌ను శేఖ‌ర్ క‌మ్ముల దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవ‌ల్లో సినిమాను తీస్తుండ‌డం విశేషం. ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే నెల జూన్ 20న తమిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ, తెలుగు బాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కుబేర పోస్ట‌ర్స్ కు ఊహించ‌ని రీతిలో రెస్పాన్స్ ల‌భించింది. తాజాగా మ‌రో న్యూ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు ద‌ర్శ‌కుడు. దీనికి కూడా సూప‌ర్ గా ఆద‌ర‌ణ ల‌భించ‌డం విశేషం.

Also Read : Lokesh Kanagaraj As a Hero :హీరోగా కోలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్

dhanushKuberaRashmika MandannaUpdatesViral
Comments (0)
Add Comment