Rahul Dravid Sensational :శాంస‌న్ ను ద్ర‌విడ్ ప‌క్క‌న పెట్టాడా..?

కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ భ‌విత‌వ్యం ప్ర‌శ్నార్థకం

Rahul Dravid : హైద‌రాబాద్ – అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన యంగ్ క్రికెట‌ర్ల‌లో ఒక‌డు కేర‌ళ‌కు చెందిన స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. గ‌త కొంత కాలంగా ప‌డుతూ లేస్తూ వ‌స్తున్నాడు. అద్భుత‌మైన ఆట‌గాడిగా పేరు పొందాడు. బ్యాట‌ర్ గా , వికెట్ కీప‌ర్ గా రాణిస్తూ వ‌చ్చాడు. ఈ త‌రుణంలో తాజాగా జ‌రిగిన ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో కొన్ని మ్యాచ్ లే ఆడాడు. చేతి వేలికి తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో ఉన్న‌ట్టుండి దూరంగా ఉన్నాడు. త‌న స్థానంలో మ‌రో యంగ్ క్రికెట‌ర్ రియాన్ ప‌రాగ్ కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించాడు హెడ్ కోచ్ .

Rahul Dravid Sensational Decision Viral

ఇదిలా ఉండ‌గా ముందు నుంచి ద్ర‌విడ్(Rahul Dravid) కు ఎందుక‌నో శాంస‌న్ అంటే కొంత కోపం. త‌ను భార‌త జ‌ట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నప్ప‌టికీ త‌న‌ను ఎంపిక చేసేందుకు ఛాన్స్ ఉన్నా అవ‌కాశాలు ఇవ్వ‌లేదు. త‌న‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జ‌రిగింది. దేశంలోనే కాదు ఇత‌ర దేశాల‌లో కూడా సంజూ శాంస‌న్ కు పెద్ద ఎత్తున క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ త‌రుణంలో వ‌చ్చే ఐపీఎల్ మెగా వేలం పాట‌లో శాంస‌న్ ఉంటాడా లేదా అన్న‌ది అనుమానం వ్య‌క్తం అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

రాహుల్ ద్ర‌విడ్ ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ప్ర‌ధాన కోచ్ గా వ‌చ్చాడు. డైరెక్ట‌ర్ గా శ్రీ‌లంక మాజీ క్రికెట‌ర్ కుమార సంగ‌క్క‌ర కొన‌సాగుతున్నాడు. త‌ను కోచ్ గా ఉన్న స‌మ‌యంలో శాంస‌న్ కు పుల్ స‌పోర్ట్ దొరికింది. మ‌రో వైపు ద్ర‌విడ్ వ‌చ్చాక శాంస‌న్ ప్రాధాన్య‌త త‌గ్గింద‌ని, త‌న‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడ‌ని పెద్ద ఎత్తున టాక్ న‌డుస్తోంది. మ‌రి త‌న ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందోన‌నే ఆందోళ‌న నెల‌కొంది అభిమానుల్లో.

Also Read : Virat Kohli Shocking Comments :స్వేచ్ఛ లేక పోవ‌డం వ‌ల్లే త‌ప్పుకున్నాడా..?

BreakingIPL 2025National NewsRahul DravidSanju SamsonUpdatesViral
Comments (0)
Add Comment