Kalyan Shankar Shocking :వినోదం జీవితంలో భాగం సినిమాకు ప్రాణం

మ్యాడ్ స్క్వేర్ -2 ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్

Kalyan Shankar : మ్యాడ్ ఫేమ్ క‌ళ్యాణ్ శంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. సితార ఎంట‌ర్ టైన‌ర్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత నాగ‌వంశీ నిర్మించాడు ఈ చిత్రాన్ని. ప్రేక్ష‌కుల ముందుకు మార్చి 28న వ‌చ్చింది. రిలీజ్ అయిన తొలి రోజు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోయింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా ఆశించిన దానికంటే ఎక్కువ‌గా రావ‌డంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్ప‌టి దాకా రూ. 30 కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టింది మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ మూవీ. చిత్రం భారీ విజ‌యాన్ని సాధించిన సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్(Kalyan Shankar) చిట్ చాట్ చేశాడు.

Kalyan Shankar Shocking Comments

జీవితం రోజు రోజుకు సంక్లిష్టంగా మారుతోంది. ఈ త‌రుణంలో హింస‌, బూతు, ద్వందార్థాల‌కు తావు లేకుండా ఇంటిల్లిపాదిని, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల అభిప్రాయాలు, ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా క‌థ ఉండాల‌ని తాను ఆశిస్తాన‌ని, అందుకే మ్యాడ్ ను త‌యారు చేశాన‌ని చెప్పారు క‌ళ్యాణ్ శంక‌ర్. వినోదం అనేది అత్యంత ముఖ్య‌మ‌న్నారు. అది లేక పోతే జీవితానికి అర్థమే ఉండ‌ద‌న్నారు. లైఫ్ ఒక్క‌సారే వ‌స్తుంద‌ని, దానిని గుర్తించి ముందుకు సాగ‌డంలోనే ఆనందం ల‌భిస్తుంద‌న్నారు.

లేని దాని కోసం పాకులాడ‌టం ఆపేసి కేవ‌లం ఎంట‌ర్ టైన‌ర్ జాన‌ర్ లోనే ఉండేలా తాను జాగ్ర‌త్త ప‌డ్డాన‌ని చెప్పారు ద‌ర్శ‌కుడు. క‌థా ప‌రంగా బ‌లంగా ఉంటే ఏ సినిమా అయినా స‌క్సెస్ అవుతుంద‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. దానినే తాను ఫాలో అవుతున్నాన‌ని, అదే మ్యాడ్ స్క్వేర్ విష‌యంలో రూఢీ అయ్యింద‌ని చెప్పాడు క‌ళ్యాణ్ శంక‌ర్.

Also Read : Rakul Preet Singh Shocking :అందుకే స్టార్ డైరెక్ట‌ర్ ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించా

CommentsDirectorKalyan ShankarViral
Comments (0)
Add Comment