Lokesh Kanagaraj As a Hero :హీరోగా కోలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్

లోకేష్ క‌న‌గ‌రాజ్ కీల‌క పాత్ర‌లో

Lokesh Kanagaraj : త‌మిళ సినీ రంగంలో మోస్ట్ పాపుల‌ర్ డైరెక్ట‌ర్ గా కొన‌సాగుతున్నాడు లోకేష్ క‌న‌గ‌రాజ్(Lokesh Kanagaraj). త‌న టేకింగ్ సూప‌ర్ . ప్ర‌స్తుతం త‌లైవా ర‌జ‌నీకాంత్ తో కూలీ తీస్తున్నాడు. దీనిని వ‌చ్చే ఆగ‌స్టు నెల‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు ప్రారంభించాడు. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ ఒక్క మూవీలో న‌టించినందుకు నిర్మాణ సంస్థ ఏకంగా భారీ ఎత్తున రెమ్యూన‌రేష‌న్ ర‌జ‌నీకాంత్ కు ఇచ్చిన‌ట్లు సినీ ప‌రిశ్ర‌మ‌లో టాక్ . ఇది ప‌క్క‌న పెడితే తాజాగా కొంత కాలం పాటు తాను సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు లోకేష్ క‌న‌గ‌రాజ్.

Lokesh Kanagaraj As a Hero

ఇదిలా ఉండ‌గా చాలా మంది సినీ రంగానికి చెందిన ద‌ర్శ‌కులు అతిథి పాత్ర‌ల్లో న‌టించారు. వారిలో ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి, శంక‌ర్, దివంగ‌త కె. విశ్వ‌నాథ్, త‌దిత‌రులు ఉన్నారు. తాజాగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. త‌ను సినిమా ప్ర‌మోష‌న్స్ బిజీగా ఉన్నాడు. ఈ త‌రుణంలో త‌ను హీరోగా కొత్త మూవీలో న‌టించ‌నున్న‌ట్లు టాక్. ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు మూవీ మేక‌ర్స్.

ప్ర‌స్తుతం త‌ను లోకేష్ సినీ వ‌ర్క్స్ పేరుతో ఓ సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. వ‌రుస సినిమాల‌తో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గా పేరు పొందాడు. ఇటీవ‌ల క‌మ‌ల హాస‌న్ త‌న‌యురాలు శ్రుతి హాస‌న్ తో క‌లిసి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇది సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఉన్న‌ట్టుండి త‌న‌కు సంబంధించి త‌మిళ డైరెక్ట‌ర్ అరుణ్ మాతేశ్వ‌ర‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే కొత్త మూవీలో హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ న‌టించ‌నున్న‌ట్లు చెప్పాడు. దీంతో ద‌ర్శ‌కుడి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంతోషానికి లోన‌వుతున్నారు.

Also Read : Hero Mahesh Babu-Khaleja :మే 30న మ‌హేష్ బాబు ఖ‌లేజా రీ రిలీజ్

CinemaLokesh KanagarajUpdatesViral
Comments (0)
Add Comment