Director Maruthi Interesting :డైరెక్ట‌ర్ మారుతి మూవీ కీల‌క అప్ డేట్

డ‌బ్బింగ్ కు సిద్ద‌మ‌వుతున్న రాజా సాబ్

Director Maruthi : పాన్ ఇండియా స్టార్ హీరో డార్లింగ్ ప్ర‌భాస్ , నిధి అగ‌ర్వాల్ , మాళ‌విక మోహ‌న్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం రాజా సాబ్. దీనిని భ‌ళే భ‌ళే మ‌గాడివోయ్ మూవీ ఫేమ్ ద‌ర్శ‌కుడు మారుతి తీస్తున్నాడు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి ఈ చిత్రంపై. పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేస్తున్నారు నిర్మాత‌లు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాల్సి ఉంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున న‌మ్మ‌కం పెట్టుకున్నారు ఈ చిత్రంపై. రొమాంటిక్ , స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ గా దీనిని తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు మారుతి.

Director Maruthi Interesting Comments

గ‌తంలో ప్ర‌భాస్ పూర్తిగా ల‌వ‌ర్ బాయ్ గా మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ లో న‌టించాడు. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేశాడు. ఇదే స‌మ‌యంలో రాజా సాబ్(Raja Saab) కు ఓకే చెప్పాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్స్ వ‌స్తున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ ప్ర‌సాద్ దీనిని నిర్మిస్తున్నాడు. పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేశాడు. కానీ విడుద‌ల‌కు ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. ఇంకా కొంత టెక్నిక‌ల్ గా మార్పులు చేయాల్సి ఉంద‌ని తెలిపాడు ద‌ర్శ‌కుడు మారుతి.

తాజాగా మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే రాజా సాబ్ మూవీ డ‌బ్బింగ్ ద‌శ వారం రోజుల్లో ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ఇదే వార్త టాలీవుడ్ లో గుప్పుమంటోంది. ప్ర‌స్తుతం ప్రభాస్ స‌మ్మ‌ర్ వెకేష‌న్ లో బిజీగా ఉన్నాడు. త‌ను ఇట‌లీలో కొనుగోలు చేసిన ఫ్లాట్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే వారం రోజుల్లో తిరిగి ఇండియాకు రానున్నాడ‌ని, త‌న వ‌ద్ద‌కే డ‌బ్బింగ్ చెప్పించేందుకు ద‌ర్శ‌కుడు మారుతి ఏర్పాట్లు చేసిన‌ట్లు టాక్.

Also Read : Hero Jr NTR-War 2 :తార‌క్ వార్ 2 మూవీ సాంగ్ పై ఫోక‌స్ 

MaruthiPrabhasThe Raja SaabUpdatesViral
Comments (0)
Add Comment