Natural Star Nani-Sujeeth : సుజిత్ తో నేచుర‌ల్ స్టార్ నాని మూవీ

వ‌రుస హిట్స్ తో దూసుకు పోతున్న స్టార్

Sujeeth : క‌థ‌ల‌ను ఎంపిక చేసుకోవ‌డంలో నాని త‌ర్వాతే ఎవ‌రైనా. చాలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో వ‌చ్చే వారితోనే తను జ‌ర్నీ చేస్తున్నాడు. న‌టుడిగా అంద‌నంత ఎత్తుకు ఎదిగిన నేచుర‌ల్ స్టార్ ఉన్న‌ట్టుండి నిర్మాత‌గా కూడా మారాడు. త‌ను తీసిన కోర్టు సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. కొన్నాళ్ల పాటు ఎక్కువ సినిమాల‌లో న‌టించ‌డంపై ఫోక‌స్ పెట్టాడు. కానీ ఇప్పుడు రూట్ మార్చేశాడు. కేవ‌లం ఏడాదికి ఒక‌టి లేదా రెండు కంటే ఎక్కువ మూవీస్ చేయ‌డం లేదు. అయితే న‌టించిన ప్ర‌తి మూవీ ప‌క్కాగా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలుస్తోంది. త‌ను న‌టించిన తాజా చిత్రం హిట్ -3 సెన్సేష‌న్. ఏకంగా రూ. 100 కోట్ల‌ను వ‌సూలు చేసింది.

Natural Star Nani, Sujeeth Movie Updates

మ‌రో వైపు ప్యార‌డైజ్ మూవీలో న‌టిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన టీజ‌ర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. దీనిని వ‌చ్చే ఏడాది 2026 మార్చిలో రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించాడు. దీనిని ద‌స‌రా చిత్రం ఫేమ్ శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం విశేషం. ఇది పూర్త‌యిన వెంట‌నే మ‌రో కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. యంగ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుజిత్(Sujeeth) తో క‌లిసి తాను సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు నేచుర‌ల్ స్టార్.
ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో భారీ సెట్స్ వేశారు శ్రీ‌కాంత్ ఓదెల మూవీ కోసం .

నాని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు హిట్ 3 స‌క్సెస్ కావ‌డంతో. మూవీ స‌క్సెస్ మీట్ పెట్టాడు. సినిమా అయి పోయిన వెంట‌నే సుజీత్ తో ప్రాజెక్టు ప్రారంభం కానుంద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సుజిత్ ఓజీ తీస్తున్నాడు. దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రో వైపు సుజిత్ కొంత గ్యాప్ ఇచ్చి నానితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడ‌ని టాక్. మొత్తంగా నాని నేచుర‌ల్ స్టార్ నే కాదు ద‌మ్మున్నోడు అనిపించేందుకు ట్రై చేస్తున్నాడు.

Also Read : Aditi Rao Hydari Sensational :అదితి రావు వైర‌ల్ కామెంట్స్ హ‌ల్ చ‌ల్

CinemaHero NaniSujithUpdatesViral
Comments (0)
Add Comment