Director Vamsy Shocking :హీరోయిన్ల‌ను ఆ దృష్టితో చూడ‌లేదు 

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన వంశీ

Director Vamsy : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన ద‌ర్శ‌కుడు వంశీ. ఆయ‌న తీసిన ప్ర‌తి మూవీ ఓ దృశ్య కావ్యం. క‌వి, ర‌చ‌యిత‌, భావుకుడు, స‌హృద‌య‌త క‌లిగిన వ్య‌క్తిగా గుర్తింపు పొందారు. త‌ను ఎంపిక చేసిన హీరోయిన్ల‌కు ప్రత్యేక‌త ఉండేలా చూశారు. ఎక్క‌డా అస‌భ్య‌త అన్న‌ది లేకుండా , సెక్స్ కోణంతో లేకుండా చూస్తేనే ఆక‌ట్టుకునేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు వంశీ.

Director Vamsy Shocking Comments

తాజాగా ద‌ర్శ‌కుడు వంశీ(Director Vamsy) చిట్ చాట్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏనాడూ హీరోయిన్ల‌ను రొమాంటిక్, ప్రేమ దృష్టితో చూడ‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు. గ‌తంలో తాను సినీ రంగానికి ప‌రిచ‌యం చేసిన ప్ర‌ముఖ న‌టి భానుప్రియ‌తో ల‌వ్ లో ప‌డ్డాడని, పెళ్లి కూడా చేసుకున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఏ రంగంలో లేని విధంగా సినిమా రంగంలో పుకార్లు, వివాహేత‌ర సంబంధాలు, విడి పోవ‌డాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే దీనిని రంగుల లోకం అంటారు.

స్వ‌త‌హాగా సున్నిత మ‌నస్త‌త్వం క‌లిగిన వంశీ ఈ అంశంపై తొలిసారిగా స్పందించారు. త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పారు. తాను ఎంపిక చేసిన హీరోయిన్లకు ఓ వ్య‌క్తిత్వం క‌లిగి ఉండాల‌ని ఆశించాన‌ని, అందుకే సినిమాల్లో అరుదైన వ్య‌క్తిత్వం క‌లిగిన పాత్ర‌లు ఉండేలా చూశాన‌ని చెప్పారు. ఏ హీరోయిన్ల‌ను ఆ దృష్టితో చూడ‌లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం వంశీ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

ఇవాళ సెక్స్, హింస‌, బూతులు, వెర్రి డ్యాన్సులు ఉంటేనే జ‌నం ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో ఉన్న ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు వంశీ తీసుకున్న నిర్ణ‌యం ఓ చెంప పెట్టు లాంటిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Hero Charan-Allu Arvind :చెర్రీ నాకు మేన‌ల్లుడు..బిడ్డ లాంటోడు

CommentsDirectorVamsyViral
Comments (0)
Add Comment