Venu Udugula : ఓ కొత్త జోనర్ నుంచి కొత్త ప్రాజెక్ట్ తో రానున్న ‘విరాటపర్వం’ డైరెక్టర్

మరో వైపు వేణు ఉడుగుల దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Venu Udugula : ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకొన్నాడు వేణు ఉడుగుల. ఆ తరవాత విరాట పర్వం’ సినిమా వచ్చింది. ఆ చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలు అందుకొంది. విరాటపర్వం తరవాత వేణు(Venu Udugula) నుంచి మరో సినిమా రాలేదు. కథలు రెడీ చేసి హీరోల్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈలోగా ఆయన నిర్మాణంలో ఓ చిత్రం మొదలైంది. అదే ‘రాజు వెడ్స్‌ రాంబాయ్‌’ శైలు కంపాటి దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్‌ సౌజన్యంతో తెరకెక్కిన సినిమా ఇది. అయితే ఈటీవీ విన్‌ సంస్థ సినిమాలు తీస్తే అది కేవలం ఓటీటీకి పరిమితం అవుతుంది. అయితే ఈ సినిమాను మాత్రం థియేటర్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌ డేట్స్‌ త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదొక లవ్‌ స్టోరీ అయినా, సెన్సిటీవ్‌ విషయాలు డీల్‌ చేశారని, కమర్షియల్‌ కోణంలో ఈ కథని తీర్చిదిద్దారని తెలుస్తోంది.

Venu Udugula Movie Updates

మరో వైపు వేణు ఉడుగుల దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ‘విరాటపర్వం’ తరవాత రెండు పెద్ద సంస్థల నుంచి ఆయన అడ్వాన్స్‌ తీసుకొన్నారు. కథ రెడీ అయ్యింది కానీ, హీరో సెట్‌ అవ్వడం లేదు. అంతా బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ కూడా వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. తొలి రెండు సినిమాల్లోనూ బలమైన సామాజిక అంశాన్ని తెరపై చూపించిన వేణు ఇప్పుడు కమర్షియల్‌ పంథాలో కథ రాసుకొన్నారని తెలిసింది.

Also Read : Game Changer : నెట్టింట దూసుకుపోతున్న ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ప్రోమో

MoviesTrendingUpdatesVenu UdugulaViral
Comments (0)
Add Comment