Double Ismart: డబుల్ ఇస్మార్ట్‌ కౌంట్‌డౌన్‌ షురూ అంటున్న పూరి

డబుల్ ఇస్మార్ట్‌ కౌంట్‌డౌన్‌ షురూ అంటున్న పూరి

Double Ismart: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్‌ పోతినేని, నిధి అగర్వాల్‌, నభా నటేష్, సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్తంగా నటి ఛార్మి నిర్మాతగా 2019లో విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దీనితో దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh)… ఈ సారి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తో 2024 మార్చి 8న మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ లో సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దీనితో 100 రోజుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కౌంట్ డౌన్ అంటూ స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Double Ismart – ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కౌంట్ డౌన్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్

వంద రోజుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సందడి షురూ అవుతోందంటూ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదనీ, ఇదివరకు ప్రకటించినట్టుగానే మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలపడానికే ఈ కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్న ఈ సినిమాకు కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Pragathi: టాటూ సీక్రెట్ ను బయటపెట్టిన నటి ప్రగతి

charmiismart sankarpuri jagannadhram phothineni puri jagannath double ismart movie
Comments (0)
Add Comment