Dragon Movie Sensational :డ్రాగ‌న్ ల‌వ‌ర్స్ కు ఖుష్ క‌బ‌ర్

21న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

Dragon : మారి ముత్తు ద‌ర్శ‌కత్వం వ‌హించిన చిత్రం డ్రాగ‌న్(Dragon). ఇది త‌మిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రూ. 150 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. బ‌ల‌మైన క‌థ‌, అద్భుత‌మైన టేకింగ్, అంత‌కు మించి న‌టీ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న ఈ సినిమాను ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లేలా చేశాయి. ప్ర‌ధానంగా ల‌వ్ టుడేతో ప్రేక్ష‌కుల హృద‌యాల మీద చెర‌గ‌ని ముద్ర వేసిన న‌టుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ఇందులో కీ రోల్ పోషించాడు.

Dragon Movie OTT Upates

త‌ను ద‌ర్శ‌కుడు కూడా. అల‌వోక‌గా భావాల‌ను ప‌లికించ‌డంతో పాటు గుండెల‌ను హ‌త్లుకునేలా సూప‌ర్ షో చేశాడు. సినిమాను న‌డిపించిన తీరుకు ద‌ర్శ‌కుడు మారిముత్తుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇందులో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ తో పాటు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, క‌యాదు లోహ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. స్టూడెంట్ గా , ల‌వ‌ర్ గా ప్ర‌దీప్ న‌ట‌న పీక్ స్టేజ్ కు వెళ్లింది. దీనిని చూసిన వారంతా త‌న న‌ట‌న‌కు, ముఖ్యంగా డ్రాగ‌న్ కు ఫిదా అయ్యారు. జేజేలు ప‌లికారు. దీంతో బాక్సులు పూర్తిగా కాసుల‌తో నిండి పోయాయి. సినిమా స‌క్సెస్ కు మ్యూజిక్ కూడా తోడైంది.

మూవీ అద్భుత విజ‌యాన్ని అందుకోవ‌డంతో డ్రాగ‌న్ ఓటీటీకి సంబంధించి ప‌లు సంస్థలు స్ట్రీమింగ్ కోసం పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు నెట్ ఫ్లిక్స్ చేజిక్కిచ్చుకుంది. ఈ మేర‌కు సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఓటీటీలో ఈనెల 21న స్ట్రీమింగ్ అవుతోంద‌ని, మిస్ అయిన వారంతా మ‌రోసారి చూడాల‌ని సూచించింది. సో అద్భుత‌మైన ల‌వ్, ఎంట‌ర్ టైన్ , ఉత్కంఠ భ‌రిత మూవీని చూసేందుకు రెడీ కండి ఇంకెందుకు ఆల‌స్యం.

Also Read : Hero Sheraz Mehdi Movie : 21న ఓ అందాల రాక్ష‌సి రిలీజ్

Comments (0)
Add Comment