Dragon : షార్ట్ ఫిలింస్ తీస్తూ లవ్ టుడ్ ద్వారా దేశ వ్యాప్తంగా హల్ చల్ చేసిన నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో అవమానాలు భరించిన తను ఇప్పుడు ప్రతి ఒక్కరు తన గురించి చర్చించుకునేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. తాజాగా మారి ముత్తు దర్శకత్వం వహించిన చిత్రం డ్రాగన్(Dragon). దీనిని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. తొలి షో నుంచే దుమ్ము రేపింది. కాసుల వర్షం కురిపించింది. అత్యంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. అంచనాలు కాదని సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది డ్రాగన్. ఏకంగా రూ. 130 కోట్లకు పైగానే వసూలు చేసింది. అతి తక్కువ కాలంలో ఇంత భారీ ఎత్తున కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇది ఒక్కటి కావడం విశేషం.
Dragon Movie OTT Updates
డ్రాగన్ ను స్వంతం చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు భారీగా పోటీ పడ్డాయి. కానీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ చివరకు చేజిక్కించుకుంది. మార్చి నెలలో మొత్తం 10 టాప్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తే అత్యధిక నిమిషాలను కలిగి ఉన్న చిత్రంగా డ్రాగన్(Dragon) నిలిచింది. మేకింగ్, టేకింగ్ , డైలాగులు, కథ, నటీ నటుల నటన హత్తుకునేలా చేసింది. ప్రధానంగా యువతీ యువకుల హృదయాలను దోచుకుంది. ఎక్కడ చూసినా ఈ సినిమానే. ప్రధానంగా ఇందులో నటించిన నటి కయాదు లోహర్ గతంలో తెలుగులో నటించినా ఆశించిన మేర ఆడలేదు. కానీ ఈ ఒక్క సినిమాతో తను నేషనల్ క్రష్ గా మారి పోయింది. లెక్కలేనన్ని అవకాశాలు దక్కాయి. ఇక ప్రదీప్ రంగనాథన్ ను స్వంతం చేసుకుంది ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్.
తాజాగా స్ట్రీమింగ్ పరంగా చూస్తే నెంబర్ 2లో నిలిచింది డ్రాగన్. టాప్ లో మలయాళ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఉంది. ఈ సినిమా ప్రస్తుతం మార్చి 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియమణి, వైశాఖ్ నాయర్, కుంచకో బోబన్ ప్రధాన పాత్రల్లో నటించారు. జీతూ అష్రఫ్ తీశాడు. సినిమాను చూసిన వాళ్లంతా మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు. నీరాజనం పలుకుతున్నారు. స్ట్రీమింగ్ పరంగా చూస్తే టాప్ లో ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఉండగా డ్రాగన్, ఎమర్జెన్సీ, ఆజాద్, తండేల్, ద ఎలక్ట్రిక్ స్టేట్, విడాముయార్చి, ధూమ్ ధామ్ నిలిచాయి.
Also Read : Officer on Duty Sensational : నెట్ ఫ్లిక్స్ లో మాలీవుడ్ మూవీ హవా