Hero Dulquer-Lucky Baskhar OTT :ఓటీటీలో దుల్క‌ర్ ల‌క్కీ భాస్క‌ర్ టాప్

13 వారాల పాటు అగ్ర స్థానంలోనే

Lucky Baskhar : మ‌ల‌యాళ సినీ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ల‌క్కీ భాస్క‌ర్(Lucky Baskhar) అరుదైన ఘ‌న‌త సాధించింది. డ‌బ్బు విలువ ఏమిటో, జీవితంలో ఎలా నెగ్గుకు రావాలో , స‌మాజంలో గుర్తింపు ఏ విధంగా దొరుకుతుంద‌నే దానిపై ద‌ర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా రిలీజై రికార్డ్ బ్రేక్ చేసింది.

Lucky Baskhar Movie OTT Updates

ఇక ఓటీటీల్లో సైతం దుమ్ము రేపింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ల‌క్కీ భాస్క‌ర్ చిత్రం 13 వారాల పాటు టాప్ లో నిలిచింది. అన్ని సినిమాల‌ను తోసిరాజ‌ని నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించ‌డం విశేషం.

సూప‌ర్ స్టార్స్, భారీ బడ్జెట్, హంగులు సినిమాకు అక్క‌ర్లేద‌ని, క‌థ‌లో ద‌మ్ముంటే ఆ మూవీ త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని నిరూపించింది ల‌క్కీ భాస్క‌ర్. ప్ర‌తి ఒక్క‌రు ఈ సినిమాతో క‌నెక్ట్ అయ్యారు. అంతేనా త‌మ‌ను తాము ఇందులో చూసుకున్నారు.

ల‌క్కీ భాస్క‌ర్ తో పాటు మ‌రికొన్ని చిత్రాలు ఓటీటీలో చోటు ద‌క్కించుకున్నాయి. కిర‌ణ్ అబ్బ‌వ‌రం కె, శివ కార్తికేయ‌న్ అమ‌ర‌న్, దుల్క‌ర్ స‌ల్మాన్ ల‌క్కీ భాస్క‌ర్ లు పోటీ ప‌డ్డాయి. ఈ మూడు సినిమాలు గుండెల‌ను హ‌త్తుకునేలా చేశాయి. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాయి. ప్ర‌ధానంగా దుల్క‌ర్ స‌ల్మాన్ చేసిన న‌ట‌న ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప చేసేలా చేశాయి. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎన్న‌ద‌గిన చిత్రంగా ఈ మూవీ నిలిచి పోతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Hero Pradeep Ranganathan :లైఫ్ లోని ఘ‌ట‌న‌లే నా సినిమాలు

Lucky BaskharOTTTrendingUpdates
Comments (0)
Add Comment